రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్వహణ మరింతగా మెరుగుపడాలి | - | Sakshi
Sakshi News home page

రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్వహణ మరింతగా మెరుగుపడాలి

Feb 21 2026 7:08 AM | Updated on Feb 21 2026 7:08 AM

రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్వహణ మరింతగా మెరుగుపడాలి

రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్వహణ మరింతగా మెరుగుపడాలి

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, భవిత కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులపై కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక అధికారుల తో శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష జరిపారు.ఒక్కో మండలం వారీగా స్పె షల్‌ ఆఫీసర్లు చేపట్టిన క్షేత్రస్థాయి సందర్శనలు, ఆ యా పాఠశాలల్లో వారుగమనించిన అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా స్కూళ్లలో నెలకొ న్న స్థితిగతులు,పెండింగ్‌ పనులు, ఎంఎస్‌వో లు సందర్శించిన దృశ్యాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ పరిశీలించారు.క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పరిశీలనలు కొనసాగించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే అందుబాటులో ఉ న్న భవిత కేంద్రాల నిర్వహణ మరింతగా మెరుగుపడాలని, వివిధ దశలలో, ని ర్మాణాల్లో ఉన్న కేంద్రాల పనులను వేగంగా పూర్తి చేయించాలని సూ చించారు. రెసిడెన్షియల్‌ స్కూ ల్స్‌, వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం మెనూ ప్రకారం అందుతుందా లేదా అన్నది పరిశీలించాలని, మెనూ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని క లెక్టర్‌ స్పష్టం చేశారు. డీఆర్డీవో సాయాగౌడ్‌, డీఈవో అశోక్‌, ఆర్‌సీవోలు, ఇంజినీరింగ్‌ అధికారులు, మండల స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement