చోరీ కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

Feb 21 2026 7:08 AM | Updated on Feb 21 2026 7:08 AM

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

తాడ్వాయి: ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై నరేశ్‌ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండల కేంద్రంలోని హనుమాన్‌ ఆలయంలో ఈ నెల 18న రాత్రి చోరీ జరిగింది. 19న ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి సీతారాందాస్‌ కు ఆలయ హుండీ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం తాడ్వాయిలో వేకువజామున పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న హోంగార్డు బాలాజీ, కానిస్టేబుల్‌ అనిల్‌కు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని విచారించారు. విచారణలో నిందితుడు లింగంపేట్‌ మండలం రాంపూర్‌కు చెందిన గోడండ్ల పావులు హనుమాన్‌ ఆలయంలో చోరీ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా గతంలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌ పీఎస్‌ పరిధిలోని పలు ఆలయాల్లో సైతం హుండీల చోరీకి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతని వద్ద ఉన్న రూ. 200 నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిని త్వరగా పట్టుకున్న హోంగార్డు, కానిస్టేబుల్‌ను ఎస్పీ అభినందించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement