రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట

Feb 21 2026 7:08 AM | Updated on Feb 21 2026 7:08 AM

రాష్ట

రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట

రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట సీఎం కప్‌ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం ఎంఈడీ పరీక్ష ఫీజు చెల్లించండి ముగిసిన బీటెక్‌ పరీక్షలు చిరుత దాడిలో రెండు లేగదూడల మృతి

నగర మేయర్‌ కూరగాయల ఉమారాణి

నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని నగర మేయర్‌ కూరగాయల ఉమారాణి అన్నారు. శుక్రవారం స్థానిక డీఎస్‌ఏ మైదానంలో సీఎం కప్‌ క్రీడల ను ఆమె ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో క్రీడలకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నా రని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజ మన్నారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌర వ వందనాన్ని ఆమె స్వీకరించారు. అనంతరం జిల్లా డీవైఎస్‌వో పవన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తున్నాయన్నారు. పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 28 బాల, బాలికల జట్లు పాల్గొంటున్నట్లు డీవైఎస్‌వో తెలిపారు. కార్యక్రమంలో కరాటే రమేశ్‌, జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం కార్యదర్శి బొబ్బిలి నగేశ్‌, జిల్లా కబడ్డీ కోచ్‌ మీసాల ప్రశాంత్‌, పలువురు కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి: నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ స్టేడియంలో శుక్రవారం సీఎం కప్‌ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ నగర మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ చంద్రశేఖర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈసందర్భంగా కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల జట్లతోపాటు వివిధ జిల్లాల జట్లు మార్చ్‌పాస్ట్‌ చేయగా అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ పోటీలు ఈ నెల 23 వరకు జరగనున్నాయి.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ 3వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్ష ఫీజు ఈ నెల 27వరకు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి(కంట్రోలర్‌) సంపత్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి నెలలో నిర్వహించే ఈ పరీక్షలకు రూ. వంద అపరాధ రుసుముతో మార్చి 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అన్నారు. పూర్తి వివరాలకు తెయూ వెబ్‌సైట్‌ www. telanganauniversity. ac. in ను సంప్రదించాలని కంట్రోలర్‌ సూచించారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న బీటెక్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిసినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. చివరి రోజు పరీక్షకు 71 మందికి 71 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

నిజాయితీ చాటిన

ఆర్టీసీ కండక్టర్‌, డ్రైవర్‌

ఆర్మూర్‌టౌన్‌: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగును తిరిగి అందజేసి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ నిజాయితీ చాటారు. వివరాలిలా ఉన్నాయి. భీమ్‌గల్‌ నుంచి ఆర్మూర్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో కోనసముందర్‌ గ్రామానికి చెందిన లలిత శుక్రవారం ప్రయాణించింది. ఆర్మూర్‌లో దిగిన ఆమె తన బ్యాగును బస్సు మరిచిపోయింది. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్‌ రాజేశ్వర్‌, డ్రైవర్‌ విజయ్‌ ఆ బ్యాగును ఆర్మూర్‌ డిపో మేనేజర్‌ యాదగిరికి అందజేశారు. అందులో ఫోన్‌తో పాటు, రూ. పదివేల నగదు ఉన్నాయి. బ్యాగులో ఉన్న ఫోన్‌ ఆధారంగా ప్రయాణికురాలు వివరాలు సేకరించిన ఆర్టీసీ అధికారులు ఆమెకు అందించారు. ప్రయాణికురాలి బ్యాగును అప్పగించిన కండక్టర్‌, డ్రైవర్‌లను పలువురు అభినందించారు.

లింగంపేట: మండలంలోని గాంధీనగర్‌ శివారులో గురువారం రాత్రి చిరుత రెండు లేగదూడలపై దాడి చేసి చంపినట్లు తండా సర్పంచ్‌ బాబు శుక్రవారం తెలిపారు. తండాకు చెందిన షేక్‌ రజాక్‌ అనే రైతు రోజు మాదిరిలాగే తన ఆవులు, లేగదూడలను తండా శివారులోని పశువుల కొట్టంలో కట్టేసి ఉంచాడు. రాత్రి వేళ చిరుత కొట్టంలోకి ప్రవేశించి రెండు లేగదూడలను హతమార్చింది. ఘటన స్థలాన్ని ఎఫ్‌ఆర్‌వో రామకృష్ణ, ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌వో వాసుదేవ్‌ పరిశీలించారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధిస్తామని హామీ ఇచ్చారు. రెండు లేగదూడల మృతితో రూ. 50వేల నష్టం జరిగిందని అధికారులు ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.

రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట 1
1/2

రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట

రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట 2
2/2

రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement