సేవాలాల్‌ బాటలో నడవాలి | - | Sakshi
Sakshi News home page

సేవాలాల్‌ బాటలో నడవాలి

Feb 16 2026 7:41 AM | Updated on Feb 16 2026 7:41 AM

సేవాలాల్‌ బాటలో నడవాలి

సేవాలాల్‌ బాటలో నడవాలి

డిచ్‌పల్లి: బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన ఆధ్యాత్మిక బాటలో ముందుకు సాగాలని డిచ్‌పల్లి ప్రత్యేక పోలీస్‌ ఏడో బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ సీహెచ్‌ సాంబశివరావు సూచించారు. ఆదివారం బెటాలియన్‌ సమీపంలో నిర్వహించిన సేవాలాల్‌ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. భోగ్‌ బండార్‌ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్‌ బోధించిన సత్యం, ధర్మం, సమానత్వం వంటి విలువలు నేటి తరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో బెటాలియన్‌ ఆర్‌ఐలు శ్రీనివాస్‌, త్రిముఖ్‌, మారుతి, అధికారులు, సిబ్బంది, సేవాలాల్‌ మహరాజ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement