ఆశాజనకంగా పసుపు ధర | - | Sakshi
Sakshi News home page

ఆశాజనకంగా పసుపు ధర

Feb 16 2026 7:41 AM | Updated on Feb 16 2026 7:41 AM

ఆశాజన

ఆశాజనకంగా పసుపు ధర

ధర ఇంకా పెరిగితే బాగుంటుంది

సాంగ్లీ ధర అమలయ్యేలా చూడాలి

క్వింటాల్‌కు రూ.13,500

నుంచి రూ.15 వేలు

నిలకడ ధరతో రైతులకు ఊరట

మోర్తాడ్‌(బాల్కొండ): పసుపు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులకు ఊరట లభిస్తోంది. మార్కెట్‌ ఆరంభం నుంచి ధర నిలకడగా కొన సాగుతోంది. గతంలో పసుపు పంటకు ఆశించిన ధర లేకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. కొన్నేళ్లపాటు జిల్లాలో సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాల వరకూ సాగింది. ధర పడిపోవడంతో అనేక మంది రైతులు పెట్టుబడులు కూడా వెళ్లదీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. లాభాల మాట ఎలా ఉన్నా నష్టాలను మూ ట గట్టుకోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సీజన్‌లో పసుపు పంటకు రూ.13,500 నుంచి రూ.15 వేల వర కు ధర లభించింది. కుర్కుమిన్‌ శాతం ఎక్కువ ఉన్న పసుపును కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.

పాత పసుపునకు తగ్గిన ధర..

రసాయనాల వినియోగం తగ్గిస్తేనే కుర్కుమిన్‌ శాతం వృద్ధి చెందుతుందని ఉద్యాన శాస్త్రవేత్తలు, అధికారులు సూచించడంతో రైతులు పసుపు సాగులో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో పసుపులో కుర్కుమిన్‌ శాతం వృద్ధి చెందడంతో ధర నిలకడగా ఉంది. గతంలో పాత పసుపునకు ధర ఎక్కువ ఉండేది. కానీ, ఈసారి భిన్నమైన పరిస్థితులు ఏర్పడి పాత పసుపునకు ధర తగ్గిపోతుంది. ఆరంభంలో పాత పసుపునకు క్వింటాలుకు రూ.16వేల వరకు పలికిన ధర రూ.13 వేలకు పడిపోయింది. కొత్త పంటలో కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ఈ సీజన్‌లో తవ్వి ఉడికించిన పసుపును కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పసుపు సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, కొన్నిచోట్ల రోగాల బారినపడి దిగుబడిపై ప్రభావం చూపడంతో మార్కెట్‌లో పసుపు కొరత ఉందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఉన్న పంటకు వ్యాపారులు ధరను ఒకే విధంగా కొనసాగిస్తున్నారని రైతులు చెబుతున్నారు. సాంగ్లీ మార్కెట్‌తో పోల్చితే నిజామాబాద్‌ మార్కెట్‌లో ఒక్కో క్వింటాలుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 ధర తక్కువ ఉంది. సాంగ్లీ మార్కెట్‌లో ఎక్కువ నాణ్యత ఉన్న పసుపునే కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో కొద్దిమంది రైతులు మాత్రమే అక్కడి మార్కెట్‌కు పసుపును తరలిస్తున్నారు.

ఈ సీజన్‌లో పసుపునకు ఇప్పుడున్న ధర కాకుండా కొంత పెరిగితే బాగుండేది. పెట్టుబడులకు అనుగుణంగా ధర పెరిగి ఉంటే వచ్చే సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు అవకాశం ఉండేది. ఈసారి రూ.15 వేలకు మించి ధర లభిస్తే రైతులకు ఎక్కువ లాభం జరిగేది. – బద్దం రాజశేఖర్‌ రెడ్డి, రైతు, తిమ్మాపూర్‌

సాంగ్లీ మార్కెట్‌కు ఇ క్కడి నుంచే పసుపు త రలిపోతుంది. అక్కడి మార్కెట్‌లో ఉన్న ధర ఇక్కడ కూడా లభించి ఉంటే బాగుండేది. మార్కెట్‌కు రైతులు నాణ్యమైన పసుపునే తరలిస్తున్నారు. సాగు మెళుకువలను పాటించి నాణ్యమైన పసుపును పండిస్తున్నారు.

– ఒల్లాడపు గంగారాం, రైతు, తిమ్మాపూర్‌

ఆశాజనకంగా పసుపు ధర1
1/2

ఆశాజనకంగా పసుపు ధర

ఆశాజనకంగా పసుపు ధర2
2/2

ఆశాజనకంగా పసుపు ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement