అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలి
సుభాష్‌నగర్: సమర్థవంతమైన పాలన అందిస్తూ పల్లెల అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాల ని మహిళా సర్పంచ్‌లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నూతనంగా ఎన్నికై న మహిళా సర్పంచులకు జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో మంగళవారం శిక్షణ ప్రారంభించగా కలెక్టర్ ముఖ్య అతి థిగా హాజరై సర్పంచుల అధికారాలు, విధులు, బాధ్యతలను వివరించి అవగాహన కల్పించారు. ఐదు రోజులపాటు కొనసాగనున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళా సర్పంచులు సద్వినియోగం చేసుకుని, గ్రామాల్లో సమర్ధవంతమైన పాలనను అందిస్తూ రిజర్వేషన్లకు సార్థకత చేకూర్చాలని అన్నారు. పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా, గ్రామ ప్రథమ పౌరురాలిగా గౌరవాన్ని పెంచుకోవాలని, ఇది భవిష్యత్‌లో మరెన్నో ఉన్నత పదవులకు ఆస్కారం కల్పిస్తుందని సూచించారు. నిధులు, విధులను సక్రమంగా విని యోగిస్తూ, అందరి సమన్వయంతో గ్రామాల సమ గ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారు లు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కస్తుర్బా గాంధీ విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శిస్తూ, ఏవైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల ప్రగతి కోసం సర్పంచ్‌లకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో తోడ్పాటునందిస్తుందని హామీ ఇచ్చారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన 10 మంది సర్పంచులను ఉత్తమ సర్పంచులుగా ఎంపిక చేసి సన్మానిస్తామని ప్రకటించారు. శిక్షణా తరగతుల్లో చెప్పే ప్ర తి అంశాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని, గ్రామాల్లో సమర్థవంతమైన పాలనను అందిస్తూ ప్రతి ఒక్క రూ ఉత్తమ సర్పంచులుగా గుర్తింపు పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి.శ్రీనివాస్ రావు, ఏవో రాజాబాబు, డీఎల్‌పీవోలు, ఆయా గ్రామాల మహి ళా సర్పంచులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
మహిళా ప్రజాప్రతినిధులు
సమర్థవంత పాలన అందించాలి
ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో
అమలు చేయాల్సిన బాధ్యత మీపైనే..
మహిళా సర్పంచ్‌లకు శిక్షణలో
కలెక్టర్ ఇలా త్రిపాఠి


