పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
● డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నియామకమైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పా ర్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన నియామకానికి కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, అబుద్ బిన్ హందాన్, ప్రీతం, ముస్తాఫా, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి


