కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

Feb 12 2026 7:11 AM | Updated on Feb 12 2026 7:11 AM

కార్ప

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

గత ఎన్నికల కంటే

2శాతం తగ్గిన పోలింగ్‌ నమోదు

ఓటేయడానికి ఆసక్తి చూపని జనం

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బుధవారం జరిగిన ఎన్నికల్లో 59.12 శాతం పోలింగ్‌ నమోదైంది. 60 డివిజన్లలో 350 మంది అ భ్యర్థులు బరిలో నిలిచారు. 134 ప్రాంతాల్లోని 488 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 3,48,051 ఓట్లకు 1,67,461 పురుషులు, 1,80,546 సీ్త్రలు, 44 ఇతరులు ఉన్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో 2,05,753 మంది ఓటు వినియోగించుకున్నారు. అందులో 98,469 మంది పురుషులు, 1,07,282 సీ్త్రలు, ఇద్దరు ఇతరులు ఉ న్నారు. మొత్తం 59.12 శాతం పోలింగ్‌ నమోదైంది. 1,42,298 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. నగరంలో ఎన్నికలను మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ పరిశీలించారు. సమస్యలు ఎ దురైన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని పరిష్కరించారు.

ఓటేసిన ప్రముఖులు

నగర పరిధిలోని గూపన్‌పల్లి 3వ డివిజన్‌లో రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రజలు పెద్దఎత్తున పోలింగ్‌కు ముందుకు రావాలన్నారు. 45వ డివిజన్‌లో ఎంపీ అర్వింద్‌ ధర్మపురి ఓటుహక్కును వినియోగించుకున్నారు. నగరంలోని హరిచరణ్‌ మార్వాడి పాఠశాలలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ దంపతులు ఏర్పాటుచేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. నగరంలో పోలింగ్‌ సరళిని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌పటేల్‌ కులాచారి పరిశీలించారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ఇందూరు కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేస్తామని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు.

స్ట్రాంగ్‌ రూమ్‌లకు బ్యాలెట్‌ బాక్స్‌లు

ఆర్మూర్‌: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగియగా బ్యాలెట్‌ బాక్సు లు స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరాయి. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో పోలింగ్‌ సరళి ఆధారంగా తమ విజయావకాశాలపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఏ వార్డులో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయనే అంశంపై చర్చించుకుంటున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల నుంచి తాయిలాలు తీసుకున్న ఒకే ఇంట్లోని ఓటర్లు పలు చోట్ల ఒక్కో ఓటును ఒక్కో అభ్యర్థికి వేసినట్లు తెలుస్తోంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల ఓట్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నా అవి గెలిపించే ఓట్లు కాలేకపోతున్నాయి. శుక్రవారం ఓట్లను లెక్కించనుండగా.. అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది.

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 1
1/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 2
2/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 3
3/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 4
4/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 5
5/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 6
6/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 7
7/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 8
8/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 9
9/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 10
10/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 11
11/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 12
12/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 13
13/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 14
14/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 15
15/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 16
16/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ 17
17/17

కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement