పరశురాముడు ప్రతిష్ఠించిన ‘శ్రీ చక్రేశ్వర శివాలయం’ | - | Sakshi
Sakshi News home page

పరశురాముడు ప్రతిష్ఠించిన ‘శ్రీ చక్రేశ్వర శివాలయం’

Feb 15 2026 12:33 PM | Updated on Feb 15 2026 12:33 PM

పరశుర

పరశురాముడు ప్రతిష్ఠించిన ‘శ్రీ చక్రేశ్వర శివాలయం’

ఏర్పాట్లు పూర్తి చేశాం

బోధన్‌రూరల్‌: పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివా లయం భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత ఆలయం ప్ర సిద్ధి చెందుతోంది. శ్రీ ఏక చక్రనగరంలో ఒకే రోజు నివసిస్తే ఏడు ముక్తిధామాలల్లో ఉన్న పుణ్యం లభిస్తుందని చరిత్రలో చెప్పబడింది. అలాంటి ప్రాంతంలో పరుశురాముడు ఆలయం నిర్మించి ప్రతిష్ఠించిన శివ లింగమే ‘శ్రీ ఏకచక్రేశ్వరుడు. తేత్రాయుగంలో పరశురాముడు బోధన్‌లో చెక్కి చెరువుగా పిలిచే ప్రాంతంలో అధిక సమయం గడిపేవాడని,ఆ సమయంలో ఈ చక్రేశ్వర ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేసేవా రని చరి త్రలో చెప్పబడింది. కాకతీయుల కాలంలో ము ష్కరులు దక్షిణ భారతదేశ దండయాత్రకు పూనుకున్న సమయంలో రక్షించుకునేందుకు ఆలయాన్ని మట్టితో కప్పివేశారని ప్రచారంలో ఉంది. కాలక్రమంలో గుంటూరు వాసి రామిరెడ్డి అనే వ్యక్తి 1959లో బోధన్‌లో స్థిరపడటానికి మట్టికోటను చదును చేస్తుండగా ఈ ఆలయం బయల్పడినట్లు పూర్వీకులు చెపుతుంటారు.

ఏకచక్రేశ్వర ఆలయలో ధర్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు పూర్తిచేశాం. భక్తులు ప్రశాంత వాతవరణంలో సమన్వయంతో స్వామివారిని దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలి. – రాములు, ఈవో, బోధన్‌

పరశురాముడు ప్రతిష్ఠించిన ‘శ్రీ చక్రేశ్వర శివాలయం’ 1
1/1

పరశురాముడు ప్రతిష్ఠించిన ‘శ్రీ చక్రేశ్వర శివాలయం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement