అభివృద్ధి ఓడిపోయింది
● అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా
నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభివృద్ధి ఓడిపోయిందని, డబ్బు, మద్యం గెలిచిందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార సరళితో ప్రజలను ఆకట్టుకున్నా.. డబ్బు, మద్యం గెలిచిందని, అభివృద్ధి ఓడిపోయిందన్నారు. ఎల్లప్పుడూ పార్టీ నాయకులకు అండగా ఉంటానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


