రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన గణతేజ, భీమ్‌గల్ మండలం ముచ్కూర్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన నిహారిక సీఎం కప్ బేస్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీలు నాగభూషణం, సుజాత తెలిపారు. ఈ నెల 14న ఆర్మూర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో గణతేజ, నిహారిక పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచడంతో రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 17 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే రాష్ట్రస్థాయి బేస్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు తరఫున పాల్గొంటారని వివరించారు.
నిజామాబాద్ లీగల్: ఎనిమిది నెలల గర్భిణిపై లైంగిక దాడి, అసభ్యకర నేరపూరిత చర్యకు పాల్పడిన ముద్దాయికి నిజామాబాద్ మహిళా కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి ధారావత్ దుర్గాప్రసాద్ ఆరేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.4 వేల జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాల ప్రకారంఎడపల్లి మండలం అంబం (వై) గ్రామానికి చెందిన ఎడ్ల అరుణ్ కుమార్ నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో ఉంటూ ప్రైవేటుగా పని చేసుకునేవాడు. 2024 సెప్టెంబర్ 17న ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది నెలల గర్భిణిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. ఘటనపై బాధితురాలు ఆరో టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం ఆధారంగా ఆరుగురు సాక్షులను విచారించిన కోర్టు, నేరాభియోగాలు రుజువు కావడంతో ముద్దాయి అరుణ్ కుమార్‌కు బీఎన్‌ఎస్ (సెక్షన్ 74) లైంగిక వేధింపుల నేరానికి నాలుగు సంవత్సరాల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి దుర్గా ప్రసాద్ ఆదేశించారు. సెక్షన్ 75(1) ప్రకారం మహిళపై అసభ్యకర, నేర పూరిత లైంగిక చర్యలకు మరో రెండు సంవత్సరాల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
● ఇద్దరికి గాయాలు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి బోధన్ రోడ్డులో సోమవారం కారు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఫులాంగ్‌కు చెందిన జాఫర్, అతని స్నేహితుడు బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాశ్, ఇతర పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో ప్రజలు గుమిగూడకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లుచేశారు. అభ్యర్థులు, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా ఎవరినీ లోనికి అనుమతించలేదు. కాగా నగర పాలక సంస్థ కార్యాలయంలోకి ఎంపీ, ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు వచ్చినా సమయానుసారంగా ఎన్నిక ప్రక్రియ నిర్వహించకపోవడంతో మున్సిపల్ అధికారులు, పీవోపై ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. అలాగే బీఆర్‌ఎస్ కార్పొరేటర్ ఇంటి వద్ద ఇటీవల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఏసీపీ ప్రకాశ్‌పై ఎంపీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


