పుర పాలకులొచ్చారు..
జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల పాలకులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు క్యాంపుల నుంచి పార్టీ ప్రతినిధులు, నేతలతో కలిసి బస్సుల్లో మున్సిపాలిటీలకు చేరుకున్నారు. మొదట కార్పొరేటర్, కౌన్సిలర్లుగా గెలిచిన వారందరితో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఓటింగ్ ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు, మద్దతుదారులు సంబురాలు నిర్వహించారు. – సాక్షి నెట్‌వర్క్


