ఇద్దరూ బీడీ కార్మికులే..
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): ఇన్నాళ్లూ బీడీలు చుట్టిన వారిద్దరూ పురపాలకులయ్యారు. భీమ్‌గల్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్లుగా ఎన్నికై న బొదిరే నాగమణి, వైస్ చైర్‌పర్సన్ సంటి లత ఇద్దరూ బీడీ కార్మికులే. బీడీలు చుడుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వీరిరువురి భర్తలు రాజకీయ నాయకులుగా అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల్లో కొనసాగుతున్నారు. చైర్‌పర్సన్ నాగమణి భర్త బొదిరే స్వామి భీమ్‌గల్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, వైస్ చైర్‌పర్సన్ సంటి లత భర్త జేజే నర్సయ్య భీమ్‌గల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి రిజర్వేషన్ అనుకూలించడంతో 6వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్‌గా గెలిచిన నాగమణి చైర్‌పర్సన్‌గా, 10వ వార్డు కౌన్సిలర్ సంటి లతను వైస్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడంతో అదృష్టం కలిసొచ్చింది.


