రసవత్తరంగా కుస్తీ పోటీలు
బోధన్/రుద్రూర్ : మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. సాలూర మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం, ఎడపల్లి మండలం ఠాణాకలాన్‌లో వీడీసీ, గ్రామ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలు రసవత్తరంగా సాగాయి. మల్లయోధులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. విజేతలకు గ్రామ ప్రజాప్రతినిధులు నగదు బహుమతులు అందజేశారు. రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామంలో తొలి సర్పంచ్ కిషన్‌రావు పటేల్ స్మారకార్థం కుస్తీ పోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన మల్లయోధులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
రసవత్తరంగా కుస్తీ పోటీలు
రసవత్తరంగా కుస్తీ పోటీలు


