నాడు భర్త.. నేడు భార్య
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): 2020 జనవరిలో జరిగిన భీమ్‌గల్ మున్సిపల్ మొదటి సాధా రణ ఎన్నికల్లో 5వ వా ర్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున బొదిరే నర్సయ్య కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అదే వార్డు నుంచి ఆయన సతీమణి బొదిరే లావ ణ్య బీఆర్‌ఎస్ తరఫున పోటీ విజయం సాధించా రు. మున్సిపాలిటీలో వరుసగా ఒకే వార్డుకు భార్యాభర్తలు కౌన్సిలర్‌గా ఎన్నికవడం విశేషం.
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): గత మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున గు న్నాల భగత్ కౌన్సిలర్‌గా గెలిచి వైస్ చైర్మన్ పీఠం కైవసం చేసుకున్నారు. ప్రసుతం జరిగిన ఎన్నికల్లో అదే వార్డు నుంచి ఆయన తల్లి గున్నాల బాలలక్ష్మి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో 4వ వార్డుకు తల్లీ, కొడుకులు వరుసగా కౌన్సిలర్లు కావడం విశేషం.
నాడు భర్త.. నేడు భార్య


