ఆరంభం.. ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

ఆరంభం.. ఆగమాగం

Feb 13 2026 5:23 AM | Updated on Feb 13 2026 5:23 AM

ఆరంభం

ఆరంభం.. ఆగమాగం

సమస్యను పైఅధికారులకు నివేదించాం

ఇందల్వాయి: ఇసుక అక్రమ రవాణా, అడ్డగోలు దోపిడీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం యాప్‌నకు ఆరంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో మన ఇసుక వాహనం యాప్‌ విధానాన్ని అమలు చేసేందుకు పైలెట్‌ జిల్లాగా నిజామాబాద్‌ను ఎంపిక చేశారు. అందులో భాగంగా జనవరి 31న యాప్‌ సేవలను ప్రారంభించారు. తక్కువ ధరలో, తక్కువ సమయంలో ఇసుకను ప్రజల ఇంటికే నేరుగా అందించేందుకు వీలుగా ఈ అప్లికేషన్‌ని రూపొందించారు. ఉన్నతాధికారులు సైతం ఈ యాప్‌పై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న కొందరికి మాత్రం అందులో తమ మండలాల పేర్లు కనబడకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు.

రూరల్‌లో జక్రాన్‌పల్లి మాత్రమే..

మన ఇసుక వాహనం అప్లికేషన్‌లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి జక్రాన్‌పల్లి మండలం మాత్రమే ఇసుక బుకింగ్‌కి అందుబాటులో ఉంది. మిగతా మండలాలు అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఇసుక అవసరం ఉన్నవారు ఇబ్బందులుపడుతున్నారు. అత్యవసరంగా ఇసుక అవసరం ఉన్నవారు కచ్చితంగా అప్లికేషన్‌ ద్వారానే అనుమతులు తీసుకోవాలని, లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు.

కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

మన ఇసుక వాహనం యాప్‌తో కొన్ని ప్రాంతాల వారికి లబ్ధి చేకూరనుండగా మరికొన్ని ప్రాంతాల వారికి ఇసుక మరింత ప్రియం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు నిజామాబాద్‌ రూరల్‌ ని యోజకవర్గంలో కొన్ని వాగు పరీవాహక ప్రాంతా ల్లో ఇసుక ఒక ట్రాక్టర్‌ (3 క్యూబిక్‌ మీటర్‌)కి రూ. ఏ డు వందల నుంచి రూ.వెయ్యి లోపే ఖర్చు అవు తుండగా బుకింగ్‌ విధానం ద్వారా వారికి రూ. 15 వందల వరకు అయ్యే అవకాశం ఉంది. మరోపక్క వాగుకు దూరంగా ఉన్న గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్‌ రూ.రెండు వేల నుంచి రూ. మూడు వేల మధ్యలో ఉండగా వారికి బుకింగ్‌ విధానం ద్వారా రూ. రెండు వేల లోపే ట్రాక్టర్‌ ఇసుక అందుబాటులోకి రా నుంది. ఏది ఏమైనా మన ఇసుక వాహనం ద్వారా ఇసుక ప్రజల చెంతకు చేరడంలో ఎన్నో సవాళ్లు ఎ దురవుతాయ ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మన ఇసుక వాహనం యాప్‌లో కొన్ని మండలాల పేర్లు లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను పైఅధికారులతోపాటు మైనింగ్‌ అధికారులకు విన్నవించాం. మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. అంతవరకు ఇసుకను అక్రమంగా తరలించొద్దు. సొంత ట్రాక్టర్‌ ఉన్న సాధారణ వినియోగదారులు 3 క్యూబిక్‌ మీటర్లకు రూ. 1174.97, ఇందిరమ్మ ఇళ్ల వినియోగదారులు రూ. 614.16 చెల్లిస్తే (లేబర్‌ చార్జీలతో కలిపి) ఇసుక ఇంటికే డెలివరీ చేస్తాం. – శాంత, ఇన్‌చార్జి తహసీల్దార్‌, ఇందల్వాయి

‘మన ఇసుక వాహనం’

యాప్‌తో ఇబ్బందులు

అయోమయంలో వినియోగదారులు

సరైన వివరణ ఇవ్వలేకపోతున్న

అధికారులు

ఆరంభం.. ఆగమాగం 1
1/1

ఆరంభం.. ఆగమాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement