కొత్త పాలకవర్గాలు పాత సవాళ్లు
నిజామాబాద్‌లో అతీగతీ లేని భూగర్భ డ్రెయినేజీ
అభివృద్ధి గాడిలో పడేనా?
జిల్లాలోని నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పట్టణాల్లో కొలువుదీరిన పాలకవర్గాలకు ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు సవాల్ విసురుతున్నాయి. ఎక్కడ చూసినా పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ అతీగతీ లేకపోగా నగరంతోపాటు ఆయా పట్టణాల్లో అమృత్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నూతన పాలకవర్గాలు కనీస సౌకర్యాలు కల్పించి తమ కష్టాలను దూరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
భీమ్‌గల్‌లో అసంపూర్తిగా మిగిలిన
సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ బిల్డింగ్ పనులు
కొత్త పాలకవర్గాలు పాత సవాళ్లు


