ప్రభుత్వ సలహాదారును కలిసిన ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సలహాదారును కలిసిన ఎమ్మెల్యే

Feb 20 2026 6:31 AM | Updated on Feb 20 2026 6:31 AM

ప్రభు

ప్రభుత్వ సలహాదారును కలిసిన ఎమ్మెల్యే

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి, నాయకుడు కాటిపల్లి నరేందర్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు సముచిత ప్రాధాన్యత ఇస్తామని వేం నరేందర్‌రెడ్డి అన్నారని కాటిపల్లి తెలిపారు. వారివెంట కాటిపల్లి రాహుల్‌రెడ్డి ఉన్నారు.

సమర్థవంతంగా

సేవలందించాలి

జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ

వై రామసుబ్బారెడ్డి

బోధన్‌: అన్ని శాఖల అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించి, ప్రజలకు సమర్థవంతంగా సేవలందించాలని సాలూ ర మండల ప్రత్యేక అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ రామసుబ్బారెడ్డి పేర్కొ న్నారు. ఆచన్‌పల్లి పరిధిలోని సాలూర బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన గు రువారం సందర్శించారు. విద్యార్థులకు త యారు చేస్తున్న వంటకాలను పరిశీలించా రు. సాలూర పీహెచ్‌సీని సందర్శించారు. స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంఈవో రాజిమంజూష, మెడికల్‌ ఆఫీసర్‌ రాజ్‌కుమార్‌, హౌసింగ్‌ ఏఈ శివ ఉన్నారు.

కూలీలను మోసగించేందుకు కేంద్రం కుట్ర

డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి

డిచ్‌పల్లి : మహాత్మాగాంధీ పేరును రూపుమాపాలనే దురుద్దేశంతోపాటు ఉపాధి హా మీ కూలీలను మోసం చేయాలని కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి ఆరోపించారు. డిచ్‌పల్లి మండలం ముల్లంగి (ఐ) గ్రామంలో గురువారం ఉపాధి కూలీలను కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు 125 రోజులు పని కల్పిస్తామని చెబుతూనే అందులో 50 రోజుల పనివేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతోందన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త ‘వీబీ జీ రామ్‌ జీ’ ద్వారా కార్పొరేట్‌ వ్యవస్థలా పని చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామీణ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని నగేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ముల్లంగి(ఐ) సర్పంచ్‌ సుదం శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ అశోక్‌, మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, ఏఎంసీ డైరెక్టర్‌ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సలహాదారును  కలిసిన ఎమ్మెల్యే
1
1/2

ప్రభుత్వ సలహాదారును కలిసిన ఎమ్మెల్యే

ప్రభుత్వ సలహాదారును  కలిసిన ఎమ్మెల్యే
2
2/2

ప్రభుత్వ సలహాదారును కలిసిన ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement