అక్రమ నిర్మాణాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Feb 20 2026 6:31 AM | Updated on Feb 20 2026 6:31 AM

అక్రమ

అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైకోర్టు తీర్పును అమలు చేసిన

కామారెడ్డి జిల్లా యంత్రాంగం

దోమకొండ: హైకోర్టు ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట ప్రభుత్వ పాఠశాల స్థలంలో నిర్మించిన దుకాణ సముదాయా న్ని జిల్లా అధికార యంత్రాంగం గురువారం కూల్చివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. 1968లో ము త్యంపేట ప్రభుత్వ పాఠశాల కోసం కాటిపల్లి వెంకట్రామిరెడ్డి, మెరుగు అంజయ్య 638/ఏ/1, 638/ ఏ/2, 638/ఏఏ సర్వే నెంబర్లలోని 2 ఎకరాల 11 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. అయితే, గ తంలో ఉప సర్పంచ్‌గా పనిచేసిన ముత్తగారి శిరీష్‌ గౌడ్‌ అనే వ్యక్తి ఎరుకల పార్వతి పేరిట 400 గజాలతో రెండు డాక్యుమెంట్లు, మహ్మద్‌ జావీద్‌ పేరిట 200 గజాలతో ఒక డాక్యుమెంట్‌, మంద ఆంజనేయులు పేరిట 400 గజాలతో రెండు డాక్యుమెంట్లు, మంద నర్సారెడ్డి పేరిట 600 గజాలతో మూ డు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. తర్వాత వీళ్ల వద్ద నుంచి తన భార్య రోజా సదరు స్థలాలను కొనుగోలు చేసినట్లు సేల్‌ డీడ్‌ తయారు చేశాడు. 2020 ఆగస్టు 25న, 2022 జూన్‌ 29న విడతలవారీగా 1–3/ఏ1, 1–3/ఏ2, 1–3/ఏ3, 1–3/ఏ4, 1–4/ఏ5 నెంబర్లతో పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్‌తో కలిసి ఇంటి నెంబర్లు సృష్టించాడు. ఆ త ర్వాత నకిలీ ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్లతో 6 నెలల్లోనే 12 లింక్‌ డాక్యుమెంట్లు సృష్టించి 2023లో దుకాణ సముదాయాన్ని నిర్మించాడు. అక్రమాలను గుర్తించిన మాజీ ఎంపీటీసీ కె.వెంకటలక్ష్మి, మాజీ ఉప సర్పంచ్‌ కుర్ర అంజయ్య హైకోర్టులో ప్రజాప్రయో జన వ్యాజ్యం దాఖలు చేశారు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు గత డిసెంబర్‌ 18వ తేదీన తీర్పు వెలువరించింది. అప్పీలుకు 8 వారాల గడు వు ఇచ్చింది. ఈ నెల 18వ తేదీతో గడువు పూర్తయ్యింది. అక్రమాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అపరేష్‌కుమార్‌, మొహియుద్దీన్‌ల బెంచ్‌ తీర్పును వెలువరించింది. పిల్‌ దాఖలు చేసినవారి తరఫున హైకోర్టు సీనియర్‌ న్యా యవాది కాటిపల్లి మహేందర్‌రెడ్డి, సరళా మహేందర్‌రెడ్డి, రవి మహేందర్‌రెడ్డి వాదనలు చేశారు.

దోమకొండ మండలం ముత్యంపేటలో అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తున్న పొక్లెయిన్లు

అధికారుల వింత ప్రవర్తన..

హైకోర్టు తీర్పు అమలు చేసేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ సుధాకర్‌, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై ప్ర భాకర్‌, పంచాయతీ కార్యదర్శి అంజయ్య గురువారం ముత్యంపేటకు చేరుకున్నారు. నిర్మాణా న్ని కూలగొట్టే విషయంలో చాలా సమయం తా త్సారం చేశారు. శాంతిభద్రతల సమస్య వస్తోందంటూ కూల్చివేత నిలిపేశారు. గ్రామస్తుల ఒత్తిడి, కలెక్టర్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో దుకాణ సముదాయాన్ని కూల్చివేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆశబోయిన అక్షర, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత1
1/1

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement