కూలీల హాజరు అంతంతే..
జాబ్ కార్డుల సంఖ్య (లక్షలు) 2.51
సభ్యులు (లక్షలు) 4.58
యాక్టివ్ జాబ్ కార్డులు (లక్షలు) 1.56
యాక్టివ్ కూలీలు (లక్షలు) 2.31
నిత్యం పనులకు 15-16
వస్తున్న వారు (వేలల్లో..)
డొంకేశ్వర్(ఆర్మూర్) : ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రోజుకు 90 మంది తగ్గకుండా ఉపాధి హా మీ పనులకు వచ్చేలా చూడాలని ఉన్నతాధికారుల చెప్పిన ఆదేశాలు జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. ఉపాధి హామీ సిబ్బందికి జిల్లా ఆఫీసు నుంచి టార్గెట్లు పెట్టినా కూడా లెక్క చేయడం లేదని, పైగా పనులు లేవని సాకులు చెప్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధి పను లు నత్తనడకన సాగుతున్నాయి. నిత్యం 15 వేల మంది మాత్రమే కూలీలు పనులకు వస్తున్నారు. రో జుకు 10 మంది కూడా హాజరుకాని గ్రామాలు జి ల్లాలో చాలానే ఉండగా, కొన్నిచోట్ల మాత్రమే కూలీ ల హాజరుశాతం బాగుంది. జిల్లాలో 545 జీపీలు ఉండగా సుమారు 350కి పైగా జీపీల్లో కూలీల హా జరు తక్కువగా నమోదవుతోంది. చెరువుల్లో పూడికతీత, గుంతల తవ్వకం లాంటి పనులు లేకపోయి నా గ్రామాల్లో ఇతర పనులు ఉన్నప్పటికీ ఉపాధి సి బ్బంది దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. దీంతో కూలీలకు పనులు లేక ఉపాధిని కోల్పోతున్నారు. వర్ని, సాలూర, బోధన్, పొతంగల్, ఏర్గట్ల, ఎడపల్లి, రుద్రూర్, ఆర్మూర్, బోధన్, ఆలూరు మండలా ల్లో కూలీల హాజరు శాతం తక్కువగా ఉంది. జిల్లా లో 2.31 లక్షల మంది కూలీలు ఉండగా సగటున రోజుకు 30 శాతమే పనులు వస్తున్నారు. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా... కూలీల హాజరు పెంచాల ని కచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని, నిర్లక్ష్యం ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పనులు చేస్తున్న ఉపాధి కూలీలు (ఫైల్)
డొంకేశ్వర్ మండలంలో మొత్తం 13 గ్రామ పంచాయతీలు ఉడగా.. అన్ని జీపీల పరిధిలో బుధవారం కేవలం 361 మంది మాత్రమే ఉపాధిహామీ పనులకు వచ్చారు. సిర్పూర్, జీజీ నడ్కుడ, దత్తాపూర్ గ్రామాల్లో కేవలం పది మంది చొప్పున కూలీలు హాజరయ్యారు. చిన్నయానం, గాదేపల్లిలో 12 మంది చొప్పున అలాగే నూత్‌పల్లిలో 15 మంది మాత్రమే వచ్చారు. ఈ పరిస్థితి ఒక్క డొంకేశ్వర్ మండలానికే పరిమితం కాలేదు. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో ఉంది.
ఉపాధి పనుల్లో పెరగని కూలీల సంఖ్య
చాలా గ్రామాల్లో 10 మంది కూడా దాటని వైనం
పనులు లేవని సాకులు
చెబుతున్న సిబ్బంది


