బోధన్‌లో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మాణమయ్యేనా?
బోధన్ టౌన్ : బోధన్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలతోపాటు శివారు కాలనీల్లో సమస్యలు తిష్ట వేశాయి. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టణాన్ని ఆనుకొని పాండుఫారం, నర్సాపూర్, ఆచన్‌పల్లి, శ్రీనివాసనగర్, చెక్కి క్యాంప్ గ్రామాలను బల్దియాలో విలీనం చేశారు. శివారు కాలనీలైన ఆటోనగర్, గరీబ్ కాలనీ, గౌడ్స్ కాలనీ, రాకాసీపేట్ పరిధిలోని ప్రెస్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వీలిన గ్రామాల్లో కొంత మేర సమస్యలు పరిష్కరించినప్పటికీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం లేక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో రోడ్లు బురదమయమవుతున్నాయి. గరీబ్ కాలనీలో తాగునీటి పైప్‌లైన్ లేక పోవడంతో ట్యాంకర్ ద్వారా నీటిని సఫఫరాను చేయాల్సి వస్తోంది. 15 ఏళ్లవుతున్నా ఆటోనగర్ కాలనీలో రోడ్లు,ఽ మురికి కాలువల నిర్మాణం చేపట్టలేదు. నర్సాపూర్‌తోపాటు పాండుఫారం, చెక్కిక్యాంప్‌లో రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పార్కులు లేక పోవడంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం కరువైంది. వీరేశలింగం పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టగా, గాంధీ పార్కులో కనీస వసతులు కరువయ్యాయి. పలుచోట్ల పైప్‌లైన్‌లకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. అమృత్ 2.0లో చేపట్టిన పైప్‌లైన్ పనుల విస్తరణ ట్యాంక్‌ల నిర్మాణ పనులు వేగంగా సాగకపోవడంతో శివారు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమీకృత వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.


