మారని ఫలితం
రీ కౌంటింగ్..
ఆర్మూర్: ఓట్ల లెక్కింపులో గందరగోళం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు ఆర్మూర్ పట్టణంలో రీ కౌంటింగ్ కోసం పట్టుబట్టారు. 18వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గెలుపొందినట్లు ప్రకటించగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఖాందేశ్ సంగీత రీ కౌంటింగ్ కోసం పట్టుబట్టారు. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఫలితంలో మార్పు రాలేదు. ఇక 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి దొండి కవిత కేవలం మూడు ఓట్ల తేడాతో విజయం సాధించడంతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి వచ్చి పోలీసులు, ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. తనను లోనికి పంపించి రీ కౌంటింగ్ చేయాలంటూ గేట్‌ను దూకేందుకు ప్రయత్నించగా.. ఆయనను లోనికి తీసుకెళ్లి రీ కౌంటింగ్ చేసినా ఫలితంలో మార్పు రాలేదు.


