కారు అద్దాలు పగలగొట్టి రూ. 8 లక్షలు చోరీ | - | Sakshi
Sakshi News home page

కారు అద్దాలు పగలగొట్టి రూ. 8 లక్షలు చోరీ

Feb 18 2026 7:25 AM | Updated on Feb 18 2026 7:25 AM

కారు అద్దాలు పగలగొట్టి రూ. 8 లక్షలు చోరీ

కారు అద్దాలు పగలగొట్టి రూ. 8 లక్షలు చోరీ

బాన్సువాడ: పార్కు చేసిన కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.8 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా బా న్సువాడలో చోటు చేసుకుంది. బిచ్కుంద మండ లం హస్గూల్‌ గ్రామానికి చెందిన యాదారావు, మా ధవ్‌రావు అనే వ్యక్తులు మంగళవారం తమ బంధువుల ఆస్పత్రి ఖర్చుల కోసం బాన్సువాడ ఎస్‌బీఐ బ్యాంకులో రూ.8 లక్షల నగదును డ్రా చేశారు. అనంతరం బిస్కెట్‌ ప్యాకెట్లు కొనేందుకు తాడ్కోల్‌ చౌరస్తాలో ఉన్న ఓ మార్టుకు వెళ్లారు. అక్కడ కా రును పార్కు చేసి బిస్కెట్లు కొనేందుకు లోపలికి వెళ్లి వచ్చి చూడగా కారు అద్దం పగులగొట్టి ఉండ టాన్ని గమనించారు. వెంటనే కారు డోర్‌ తీసి చూ డగా వెనుక సీట్లో పెట్టిన రూ.8 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement