ఏఐఎస్‌ఎఫ్ మహాసభలను జయప్రదం చేయండి
ఖలీల్‌వాడి: నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించే ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం, రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తున్న ఏకై క విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్ అని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బానోతు రఘురాం నాయక్, జిల్లా అధ్యక్షుడు సుబోద్, జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, సంజయ్, కార్తిక్, కోశాధికారి అనూష, నాయకులు కిశోర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.


