పోచారంతో బాన్సువాడ కౌన్సిలర్ల భేటీ
బాన్సువాడ: ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బాన్సువాడ కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిశారు. ఈ సందర్బంగా పోచారం మాట్లాడుతూ.. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించారని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ కౌన్సిలర్లకు పోచారం ప్రత్యేక అభినందనలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మబేగం, కౌన్సిలర్లు గడుమల లింగమేశ్వర్, దొక్కంటి శ్యామల, రుక్మిణి, హకీం, జంగం రాజశేఖర్, కటికె రమేష్, నాయకులు జంగం గంగాధర్, గురు వినయ్, ఎజాస్, బాబా, బుల్లెట్ రాజు తదితరులున్నారు.


