అధ్యయనం–పోరాటమే ఏఐఎస్‌ఎఫ్ నినాదం
విద్యారంగ సమస్యల కోసం పోరాటం చేస్తాం
ఖలీల్‌వాడి : విద్యార్థుల సమస్యల పరిష్కారం, నా ణ్యమైన విద్య, ప్రజాస్వామ్య పరిరక్షణకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) సంఘం ని రంతరం పోరాడుతోంది. ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన నినా దం ‘అధ్యయనం–పోరాటం’గా ముందుకు సాగు తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కారిస్తామని ప్రకటనలు చేస్తున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో విద్యారంగ సమస్యలు, ఫీజురీయింబర్స్‌మెంట్, హాస్టల్‌లో కనీ స మౌలిక వసతుల కోసం ఏఐఎస్‌ఎఫ్ అనేక పోరాటాలు చేపట్టింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏర్పడి 90 ఏళ్ల అవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవ మహాసభలను జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి ఈనెల 20 వరకు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం ఏర్పాట్లు చేస్తున్నారు.
1936లో ఏర్పాటు..
ఏఐఎస్‌ఎఫ్ సీపీఐ పార్టీకి అనుబంధగా పని చేస్తుంది. విద్యారంగ సమస్యల కోసం నిరంతర పోరాటాలు ఈ సంస్థ ద్వారా చేస్తారు. దీనిని 1936 ఆగ స్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏర్పాటు చేశా రు. బ్రిటీష్ పాలకుల నుంచి భారతదేశం విముక్తి కోసం ఏఐఎస్‌ఎఫ్ పని చేసింది. దేశ స్వాతంత్రం కోసం పోరాటంలో విద్యార్థులు ప్రాణత్యాగం చేశా రు. బుధవారం నుంచి ఈ నెల 20 వరకు తెలంగా ణ రాష్ట్ర ఏఐఎస్‌ఎఫ్ నాలుగవ మహాసభలు నిర్వహిస్తామని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోద్ తె లిపారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పులాంగ్ సమీపంలో ఉన్న టీటీడీ కల్యాణ మండపం వరకు ర్యాలీ ఉంటుందని అన్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 500 విద్యార్థి సంఘాల ప్రతినిధులు వస్తారని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
టీటీడీ కల్యాణ మండం వద్ద ఏర్పాట్లు చేసిన ఏఐఎస్‌ఎఫ్ సభ ఫ్లెక్సీలు
నేడు జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహాసభలు
నరసింహారెడ్డి ప్రాంగణంగా
నామకరణం
రాష్ట్రవ్యాప్తంగా తరలిరానున్న
విద్యార్థి సంఘాల ప్రతినిధులు
విద్యారంగంలో నెలకొన్న సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తాం. జిల్లాలోని విద్యార్థులకు ఆడ్మిషన్లు, సంక్షేమ హాస్టల్‌లో సమ స్యలు, ప్రవేట్ స్కూళ్ల ఫీజు లు, ఫీజు రియంబర్స్‌మెంట్ సమస్యల కోసం పో రాటాలు ఏఐఎస్‌ఎఫ్ చేస్తుంది. – రఘురాం,
ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్
అధ్యయనం–పోరాటమే ఏఐఎస్‌ఎఫ్ నినాదం


