పురాలు.. ఇక నందనవనాలు
న్యూస్‌రీల్
ప్రథమ పౌరుల తొలి వాక్కులు
రూ. వెయ్యి కోట్లతో నగరాభివృద్ధి
సాక్షి: పట్టణ శివారు కాలనీలకు తాగునీటి సరఫరా..
చైర్‌పర్సన్ : పట్టణంలోని శివారు కాలనీలతోపాటు అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అయ్యేలా అమృత్–2.0 పథకంలో పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే పైప్‌లైన్ పనుల విస్తరణ, ట్యాంక్‌ల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
● పలు కాలనీల్లో రోడ్లు లేవు.. స్థానికులకు ఇబ్బందులు
● నూతంగా ఏర్పాటైన పలు కాలనీల్లో రోడ్లు వేసేలా చర్యలు చేడుతాం. గతంలోనే రోడ్లు వేయిద్దామని అనుకున్నా వీలు కాలేదు.
● గతంలో టెండర్లయిన పనులు
ప్రారంభించలేదు
● పట్టణంలోని ప్రధాన రహదారి అయిన శక్కర్‌నగర్ చౌరస్తా నుంచి తట్టికోట్ రోడ్డు మధ్యలో కల్వ ర్టు పనులు పూర్తయ్యాయి. డ్రెయి నేజీ నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి.
● 2002 వివరాలతో పోలుస్తూ
ప్రక్రియను వేగవంతం చేయండి
● వీడియోకాన్ఫరెన్స్‌లో సీఈవో
సుదర్శన్‌రెడ్డి
బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
– 8లో u
అటవీప్రాంత ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి
సిరికొండ : సిరికొండ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న సిరిసిల్ల అటవీ ప్రాంతంలో పులి కదలికలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని ఆయా గ్రామాల ప్రజలకు సిరికొండ అటవీ రేంజ్ అధికారి కే నర్సింగరావు సూ చించారు. అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ, పులి కదలికలపై మండలంలోని తాటిపల్లి, పందిమడుగు గ్రా మాల ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రేంజర్ మా ట్లాడుతూ.. ఎక్కడన్నా పులి కదలికలు కనిపిస్తే అటవీ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే అటవీప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే చర్యలకు పూనుకోవద్దని సూచించారు. అడవిలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే సమాచారం ఇవ్వాలని అన్నారు. డిప్యూటీ రేంజ్ అధికారి గంగారాం, శిక్షణ అధికారి కృష్ణగీత్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థినులు
డిచ్‌పల్లి: రాష్ట్రస్థాయి బేస్‌బాల్ సీఎం కప్ పోటీలకు సుద్దపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల విద్యార్థినులు బి.నిశిత, డి.లిఖిత ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ టి.నళిని మంగళవారం తెలిపారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న సీఎం కప్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ఎంపికై న క్రీడాకారిణులు పాల్గొంటారన్నారు. హైదరాబాద్‌కు బయల్దేరిన క్రీడాకారిణులను ప్రిన్సిపాల్ నళిని, వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వనిత, పీఈటీ నర్మద, ఫిజికల్ డైరెక్టర్ జ్యోత్స్న, సాప్ట్‌బాల్ అకాడమీ కోచ్ వేముల మౌనిక మంగళవారం అభినందించారు.
నేడు పీఎంశ్రీ స్కూళ్లకు కేంద్ర బృందాలు
ఖలీల్‌వాడి: ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పాఠశాలల పరిశీలనకు కేంద్ర బృందాలు రానున్నాయి. బు ధ, గురువారాల్లో రెండు రోజులపాటు బృందాలు జిల్లాలో పర్యటిస్తాయి. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సూచన మేరకు వస్తున్న ఐఏ ఎస్ అధికారులు బృందాలుగా విడిపోయి స్కూళ్లను సందర్శిస్తారు. స్కూళ్ల నిర్వహణ, పురోగతిపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. నేషనల్ ఎడ్యేకేషన్ పాలసీలో భాగంగా తీసుకువచ్చిన పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 40 స్కూళ్లు ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు నిధులు కేటాయించారు. పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతో కూడిన కోర్సులు, లైబ్రరీలు, లేబొరేటరీలు, డిజిటల్ బోధన విధానాలు, శానిటేషన్ తదితర అంశాలను కేంద్ర బృందాలు తనిఖీ చేయనున్నాయి.
ఆ నివేదికల సంగతేమిటో..?
జిల్లాలోని పీఎంశ్రీ స్కూళ్లలో నిధులు గోల్‌మాల్ పై ఏంఈవోలు డీఈవో కార్యాల యానికి గతంలో నివేదికలు అందించారు. కానీ విద్యాశాఖ నుంచి నిధులు గోల్‌మాల్ చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ నివేదికలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్‌నగర్: నగరంలోని డీ–1 సెక్షన్ పరిధిలోగల పవర్‌హౌజ్ కంపౌండ్ సబ్‌స్టేషన్‌లో కొత్త 33 కేవీ బ్రేకర్ బిగించనున్నట్లు టౌన్–1 ఏడీఈ ఆర్ చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మాలపల్లి, శాంతినగర్, బాబన్‌సాహెబ్‌పాడ్, ఖిల్లా రోడ్, గాజుల్‌పేట్, లైన్‌గల్లీ, ఆర్‌ఆర్ రోడ్, నాగా రం, సాయినగర్ కాలనీ, రేడియోస్టేషన్, సీ తారాంనగర్ కాలనీలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ చైర్‌పర్సన్ పీఠాలను అధిరోహించిన అతివలు తమ పట్టణాలను నందనవనాలను చేస్తామంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా కౌన్సిల్ సభ్యులతోపాటు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రగతిదిశగా అడుగులు వేస్తామంటున్నారు. ఆయా మున్సిపాలిటీల పగ్గాలు చేపట్టిన చైర్‌పర్సన్‌లను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్‌తోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాలను కాంగ్రెస్ కేవసం చేసుకుంది. అటు గ్రామ పంచాయతీలు, ఇటు పురపాలకాల్లోన్ని అన్ని స్థానాలనూ స్వీప్ చేయడంతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచి హుషారులో ఉన్నారు. జిల్లాలో ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లోనూ భారీ విజయాలు సాధిస్తామని చెబుతున్నారు.
● సొంత జిల్లా కావడంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ 20 రోజులపాటు రెగ్యులర్‌గా జి ల్లాకు వస్తూ ప్రతి వ్యవహారాన్ని క్షుణ్ణంగా పర్యవే క్షించారు. అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన వ్యూహాలను అందించారు. పైగా సామాన్య కుటుంబానికి చెందిన తన శిష్యుడు కరాటే రమేష్ సతీమణి ఉమారాణిని నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోబెట్టడంపై మహేశ్‌గౌడ్ పార్టీ వర్గాల్లో సానుకూల ధృక్పథాన్ని పెంచారని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. జిల్లాపై గట్టి పట్టు సాధించిన పీసీసీ చీఫ్ ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లోనూ తిరుగులేని విజయాలు నమోదయ్యేలా చేశారు. భీమ్‌గల్‌లో గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్న పరిస్థితి నుంచి బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచే స్థితికి తీసుకొచ్చారు.
జోడెద్దుల్లా పనిచేస్తామని..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ మాదిరిగా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, తాను కలిసి జోడెద్దుల మాదిరిగా పనిచేస్తామని సీఎం రేవంత్ చెప్పిన విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే జోడీ మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ పూర్తి చేయాలి
నిజామాబాద్ అర్బన్: ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ ప్రక్రి య త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఇతర అంశాలపై హైదరాబాద్ నుంచి సీఈవో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2002 వివరాలతో ప్రస్తుత వివరాలను సరిపోలుస్తూ మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని మ్యాపింగ్ ప్రక్రియకు సహకారం అందించేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. 2002 ఓటర్ లిస్టు ప్రకారం కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తామన్నారు. వీసీలో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, కిరణ్మయి, ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అవినీతి రహిత పాలనే లక్ష్యం
పట్టణాభివృద్ధికి విజన్‌తో పని చేస్తాం
అభివృద్ధి, సంక్షేమ పథకాలను
ప్రజలకు చేరువ చేయడానికే
ప్రాధాన్యత
అవినీతిరహిత పాలన అందిస్తా
ఆర్మూర్ మున్సిపల్
చైర్‌పర్సన్ లహరి
అవినీతి రహిత పాలన అందించడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను పట్టణ ప్రజలకు చేరువ చేయడానికే నా మొదటి ప్రాధా న్యత. గృహిణిగా ఉంటూనే భర్త చేసే వ్యాపారంలో చేదోడువా దోడుగా ఉంటున్న నాకు రాజకీయాల్లోకి రాగానే చైర్‌పర్సన్ పదవి లభించడం ఆనందంగా ఉంది. పట్టణ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తా. – ఆర్మూర్
అవినీతి పాలనపై
మా కుటుంబ సభ్యుల వ్యాపారాలు బాగున్నాయి. మాకు డబ్బుపై ఆశ లేదు. ప్రతిష్టాత్మమైన స్థానంలో కూర్చున్నాను కాబట్టి అవినీతి రహిత పాలనను అందించడమే మొదటి ప్రాధాన్యతగా భావిస్తా. మున్సిపల్ కార్యాలయంలో కానీ, పట్టణంలోని వార్డుల్లో కానీ అవినీతికి తావులేకుండా పాలన అందిస్తా.
ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి
పెండింగ్ నిధులు తీసుకొస్తా
మినీ స్టేడియం నిర్మాణానికి కృషి
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందిస్తాం
భీమ్‌గల్ మున్సిపల్ చైర్‌పర్సన్
బొదిరె నాగమణి
ప్రతి సమస్యలను పరిష్కరిస్తాం
బోధన్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా ప్రథమ లక్ష్యం. శివారు కాలనీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ పనులు కొనసాగుతున్నాయి. నూతన కాలనీల్లో రోడ్లు వేస్తాం. రెండో సారి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. పెండింగ్ పనులను పూర్తి చేయడంతోపాటు కొత్త పనులను చేపడతాం.
– బోధన్‌టౌన్(బోధన్)
పారిశుద్ధ్య నిర్వహణకు తీసుకునే చర్యలు
పట్టణాభివృద్ధిలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణ జరిగేలా చూస్తా. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తా. తాగునీరు, వీధి దీపాల సమస్య తలెత్తుకుండా జాగ్రత్తలు తీసుకుంటా. పట్టణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. బల్దియా కార్యాలయానికి సమస్యల పరిష్కరం కోసం వచ్చే వారికి సకాలంలో పనులు పూర్తయ్యేలా అధికారులను ఆదేశిస్తా.
సాక్షి : అనూహ్యంగా చైర్ పర్సన్ పీఠం
చైర్‌పర్సన్ : కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌ డ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్ వంటి ముఖ్య నాయకుల సహకారంతో చైర్ పర్సన్‌గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది.
పట్టణ అభివృద్ధికి ప్రణాళిక..
కాంగ్రెస్ అధిష్టానం నాపై నమ్మకంతో చైర్‌పర్సన్ అవకాశం కల్పించింది. పట్టణ అభివృద్ధితోనే ఆ పదవికి న్యాయం చేయడం అవుతుంది. ముఖ్య నాయకులను సమయానుకూలంగా కలిసి నిధుల మంజూరుకు విన్నవిస్తా.
విపక్ష కౌన్సిలర్లు అడ్డుకొనే పరిస్థితి వస్తే..
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు బాగుంటాయి. తర్వాత విపక్ష కౌన్సిలర్లను సైతం కలుపుకొని వెళ్తాం. వా ర్డుల్లో పర్యటి స్తూ స్థానిక స మస్యలు తెలుసుకుంటూ స మస్యల పరిష్కారానికి అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటాం.
పట్టణ అభివృద్ధికి విజన్
ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను వినియోగించుకొని ఆదర్శవంతమైన, సుందరమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్ది రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుతాం. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, వినయ్‌రెడ్డి సహకారం ఎల్లవేళలా మాకు ఉంటుందని ఆశిస్తున్నాం.
మౌలిక సదుపాయాల కల్పన, పథకాల అమలు
పాలకవర్గం అందించే సేవల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రధానమైనది. అలాగే అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తా.
సాక్షి : నగర అభివృద్ధిపై మీ ప్రణాళిక
మేయర్ : నిజామాబాద్ నగరానికి ఎంతో చరిత్ర ఉంది. నగర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కట్టుబడి ఉంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి తీరుతాం. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే మా ముందున్న ప్రణాళిక. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని హామీనిచ్చారు. రింగ్ రోడ్డు పూర్తయితే నిజామాబాద్ దశ, దిశా మారిపోతుంది.
స్మార్ట్‌సిటీ కోసం తీసుకునే చర్యలు
నిజామాబాద్‌కు స్మార్ట్‌సిటీ పథకం కోసం కౌన్సిల్‌లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించేలా కృషి చేస్తాను. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. స్మార్ట్‌సిటీ పథకం ద్వారా వచ్చే నిధులతో నగరాన్ని సుందరీకరిస్తాం.
మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాం. 60 డివిజన్లలో శానిటేషన్ విభాగంతోపాటు డ్రింకింగ్ వాటర్, పబ్లిక్ హెల్త్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రతి కాలనీలో రోడ్లు నిర్మిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, బైపాస్ రోడ్డు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతాం. మై నారిటీ కాలనీల్లో పారిశుధ్యం, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.
రాష్ట్ర బడ్జెట్‌లో కార్పొరేషన్‌కు అదనపు నిధులు
నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం జిల్లాలోని ప్రభుత్వ పెద్దలతో కలిసి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. ప్రతిపైసా నగర అభివృద్ధికి ఖర్చు చే స్తాం. అవసరమైతే అదనపు నిధు లు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి, మంత్రులను కలుస్తాను.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాల పూర్తి
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాల ప్రస్తుత పరిస్థితిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తాను. నిధుల కేటాయింపు, ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకురావాలన్న అంశాలపై సమీక్షలో నిర్ణయం తీసుకుంటాం.
మొండి బకాయిల వసూళ్లు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆస్తి పన్ను, ఇతర పన్నులు కలుపుకుని సుమారు రూ.వంద కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని తెలిసింది. వీటి వసూళ్ల కోసం మున్సిపల్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. తప్పనిసరిగా వసూలు చేసి కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తాం.
‘నిజామాబాద్ నగరాన్ని రాబోయే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తాం.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, ఇతర ప్రభుత్వ పెద్దల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దుతాం. నా హయాంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి స్మార్ట్‌సిటీని సాధిస్తాం. ముఖ్యంగా నగరంలో పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తాను. కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారుల సహకారం, సమన్వయంతో ఆదర్శవంతమైన పాలనకు కృషి చేస్తాం. బైపాస్ రోడ్డు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. – సుభాష్‌నగర్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న
రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో ప్రక్షాళన
మా హయాంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండదు. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం. ముఖ్యమైన ఈ రెండు విభాగాలపై ప్ర త్యేక దృష్టి సారించి ప్రక్షాళన చేస్తాం. ఆదాయాన్ని సమకూర్చడంలోనూ, అనుమతులు మంజూరు చేయడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తాం.
సాక్షి : పట్టణంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు
చైర్ పర్సన్ : పలు చోట్ల డ్రెయినేజీ కల్వర్టులు చిన్నగా, ఇరుకుగా ఉన్నాయి. వర్షాకాలంలో చెత్తాచెదారం ఇరుక్కొని వరద నీరు ముందుకు ప్రవహించడం లేదు. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి
కృషి చేస్తాం.
మినీ స్టేడియం లేక క్రీడాకారులకు ఇబ్బందులు
పట్టణ పరిధిలో మినీ స్టేడియం కోసం పాలకవర్గంతో చర్చించి ముందుగా స్థలం గుర్తిస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు కోసం ప్రయత్నిస్తాం.
తాగునీటి సమస్య పరిష్కారం
పలు వార్డుల్లో తాగునీటి పైప్‌లైన్ ఎత్తుగా ఉండడంతో నీటి సరఫరాలో ఆటంకం ఏర్పడుతోంది. సమస్యను త్వరగా పరిష్కరిస్తాం. అదేవిధంగా అమృత్ 2.0 పథకంతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తాం.
వంద పడకల ఆస్పత్రి, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనుల పూర్తి
నిధులు తెచ్చి మిగిలిపోయిన వంద పడకల ఆస్పత్రి, మార్కెట్ పనులను పూర్తి చేస్తాం. ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.
పట్టణంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు
పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ దీనిపై ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా చెప్పారు. ఆగిపోయిన పనులను నిధులు తెచ్చి మూడు, నాలుగు నెలల్లో పూర్తయ్యేలా చూస్తాం. పెండింగ్ పనుల వివరాలను నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్‌కుమార్ ద్వారా పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేలా చూస్తాం.
భీమ్‌గల్ పట్టణాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తా. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా. కాంగ్రెస్‌కు పట్టం కట్టిన ప్రజల నమ్మకాన్ని నిలబెడతా. ఆగిపోయిన పనులను నిధులు తీసుకువచ్చి మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తా. క్రీడాకారుల కోసం మినీ స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. – కమ్మర్‌పల్లి(భీమ్‌గల్)
స్మార్ట్‌సిటీని సాధించి తీరుతాం
అందరి సహకారంతో ఆదర్శవంతమైన పాలనకు కృషి
పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లపై
ప్రత్యేక దృష్టి
నిజామాబాద్ నగర మేయర్
కూరగాయల ఉమారాణి
పురాలు.. ఇక నందనవనాలు
పురాలు.. ఇక నందనవనాలు
పురాలు.. ఇక నందనవనాలు
పురాలు.. ఇక నందనవనాలు
పురాలు.. ఇక నందనవనాలు
పురాలు.. ఇక నందనవనాలు
పురాలు.. ఇక నందనవనాలు
పురాలు.. ఇక నందనవనాలు
పురాలు.. ఇక నందనవనాలు


