గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ సతీమణి మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ సతీమణి మృతి

Feb 20 2026 6:31 AM | Updated on Feb 20 2026 6:31 AM

గుండె

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ సతీమణి మృతి

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు రెండు గేదెలు చోరీ

పిట్లం(జుక్కల్‌): మండలంలోని చిన్నకొడప్‌గల్‌ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి సతీమణి పుష్పలత(80) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఇంట్లో ఉన్న పుష్పలతకు ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబీకులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చి కిత్స పొందుతూ మృతి చెందారు. చిన్నకొడప్‌గల్‌లో శుక్రవా రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి) చర్చి సమీపంలో ఓ కారు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లడంతో ప్రహరీతో పాటు బాత్‌రూం పూర్తిగా ధ్వంసమైంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న కారు ధర్మారం(బి) చర్చి సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిద్రమత్తు వల్ల అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రుద్రూర్‌: కోటగిరి మండలం సుద్దులం శివారులో కట్టివేసి ఉన్న రెండు గేదెలను దుండుగులు ఎత్తుకెళ్లారు. ఎస్సై సునీల్‌ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. నాచుపల్లి తండాకు చెందిన దేవసోత్‌ వెంకట్‌ అనే వ్యక్తి ఈ నెల 14న సాయంత్రం సుద్దులం శివారులోని తన పొలంలో రెండు గేదెలను కట్టివేశాడు. మరుసటి రోజు ఉదయం వెళ్లగా గేదెలు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ సతీమణి మృతి 1
1/1

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ సతీమణి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement