పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..! | - | Sakshi
Sakshi News home page

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!

Feb 15 2026 6:48 AM | Updated on Feb 15 2026 6:48 AM

పెద్ద

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం ఎవరికి వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తం 12 వార్డులుకు గాను 8 వార్డులను కాంగ్రెస్‌ కై వసం చేసుకుంది. చైర్‌పర్సన్‌ రేసులో ఉన్న మల్లెల రాజశ్రీ ఓటమిపాలు కావడంతో ఎవరి పేరు ఖరా రు చేస్తారోనన్న అంశంపై జోరుగా చర్చసాగుతోంది. ఫలితాలకు ముందే కౌన్సిలర్‌ అభ్యర్థులను శిబిరానికి తరలించారు. అయితే చైర్మన్‌ రేసులో ఉన్న అభ్యర్థి ఓడిపోవడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. బొదిరే నాగమణి (6వ వార్డు), ఆరెపల్లి శ్రీజ (ఒకటో వార్డు), సంటి లత (10వ వార్డు), పర్శ కుశలత(2వ వార్డు) చైర్మన్‌ పదవికోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని సీనియర్‌కే పదవి కట్టబెట్టాలా.. లేక సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలా అనే అంశంపై అగ్రనాయకులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏదిఏమై నా టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిర్ణయమే ఫైనల్‌ అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. వైస్‌ చైర్మన్‌ పదవి కోసం కూడా పోటీ నెలకొంది.

ఆర్మూర్‌: పట్టణంలోని 36 వార్డుల్లో కాంగ్రెస్‌ 19, బీజేపీ 8, బీఆర్‌ఎస్‌ 5, ఎంఐఎం 1, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. పలువురు స్వతంత్రులు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఆ పార్టీ బలం మరింత పెరిగే అవకాశం ఉంది. మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ చైర్‌పర్సన్‌ పీఠం ఆశించిన ముఖ్య నాయకులు ఓటమి పాలవడంతో గెలుపొందిన అభ్యర్థుల్లో బలమైన వ్యక్తిని చైర్‌ పర్సన్‌ పీఠంపై కూర్చోబెట్టడానికి మంతనాలు కొనసాగుతున్నాయి. చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు అయిన విషయం తెలిసిందే. 29వ వార్డు నుంచి విజయం సాధించిన బత్నేస తిరుమల, 15వ వార్డు నుంచి విజయం సాఽధించిన గోనె లహరి చైర్‌ పర్సన్‌ పీఠాన్ని, 34వ వార్డు నుంచి విజయం సాధించిన నర్మె నవీన్‌ వైస్‌ చైర్మన్‌ పీఠాన్ని ఆశిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి ఆశీస్సులు ఉన్న వారు మాత్రమే చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ అయ్యే అవకాశాలు ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. తమకున్న రాజకీయ అనుభవం, గత ప్రభుత్వాల్లో చేపట్టిన పదవులు, వారి కుల సంఘాల ఓట్లు తదితర అంశాలను అగ్రనాయకులకు వివరిస్తున్నారు. చైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా మిగిలిన కౌన్సిలర్లు అందుకు అనుకూలంగా ఓటు వేసే సానుకూల పరిస్థితిని ఏర్పరచడం కోసం ఆర్మూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. నామినే టెడ్‌ పదవులు ఇస్తామంటూ ఆశావహులను బుజ్జగించే పనిలో ఉన్నారు. మరోవైపు పార్టీకి చెందిన చైర్‌ పర్సన్‌ ఆశావహుల ఓటమిపై ముఖ్య నాయకులు పోస్ట్‌మార్టం చేస్తున్నారు. ఈ పరిస్థితికి గ్రూప్‌ తగాదాలే కారణమంటూ ముస్లిం మైనార్టీకి చెందిన ఓ నాయకుడు పంపిన వాయిస్‌ మెసేజ్‌ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది.

ఆర్మూర్‌, భీమ్‌గల్‌

మున్సిపాలిటీల్లో ఉత్కంఠ

రెండు చోట్ల చైర్‌పర్సన్‌

రేసులో ఉన్న అభ్యర్థుల ఓటమి

తెరపైకి వచ్చిన ఆశావహులు

పరిగణనలోకి రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణాలు!

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!1
1/7

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!2
2/7

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!3
3/7

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!4
4/7

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!5
5/7

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!6
6/7

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!7
7/7

పెద్దల ఆశీర్వాదమే ఫైనల్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement