ఓటర్ల తీర్పే వేరు.. | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల తీర్పే వేరు..

Feb 15 2026 6:48 AM | Updated on Feb 15 2026 6:48 AM

ఓటర్ల తీర్పే వేరు..

ఓటర్ల తీర్పే వేరు..

కొందరు అభ్యర్థులకు సున్నా ఓట్లు

మరికొందరికి సింగిల్‌ డిజిట్‌..

నిజామాబాద్‌అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులకు ఒక్క ఓటూ పడకపోవడం గమనార్హం. మరికొందరికి సింగిల్‌ డిజిట్‌ అంకెలతో నిలిచారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కా ర్పొరేషన్‌తోపాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ ము న్సిపాలిటీల్లో ఈ పరిస్థితి కనిపించింది.

● నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 12వ డివిజన్‌లో ఏఐఎఫ్‌బీ తరఫున పోటీ చేసిన రుబీనా బేగం, 30, 33, 52, 54 డివిజన్‌లలో ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన అబ్దుల్‌ సలాం, హైమదీ బే గం, మహమ్మద్‌ ఫైజల్‌ హైమద్‌, తమీమ్‌ కౌసిర్‌కు ఒక్క ఓటూ పడలేదు. వారి ఓటు వారికి వేసుకోలేదు.

అలాగే కుటుంబ సభ్యులు కూడా వారికి ఓటు వేయలేదని తేలింది.

● 46, 59 డివిజన్‌ల ఇండిపెండెంట్‌ అభ్యర్థులు అబ్దుల్‌ ఖాలేద్‌, రఫియా బేగంతోపాటు 58వ డివిజన్‌లో అబ్దుల్‌ రహీస్‌కు, 42వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి రాజశేఖర్‌కు, 33వ డివిజన్‌లో అంజూమ్‌కు, 11వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి నజియా బేగంకు ఒక్కటి చొప్పున ఓట్లు నమోదయ్యాయి. 60వ డివిజన్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థి సాజిద్‌ కతున్‌తోపాటు 57వ డివిజన్‌లో రుమా బేగం, 55వ డివిజన్‌లో మౌలా ఖాన్‌, 46వ డివిజన్‌లో అబ్దుల్‌ ఖురేషీకి, 15, 12 డివిజన్‌లలో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తాజ్‌ హైమద్‌, సమ్రీన్‌ బేగం రెండు చొప్పున ఓట్లు పడ్డా యి. అలాగే 52వ డివిజన్‌లో మహమ్మద్‌ సర్జీ పర్వేజ్‌కు 5 ఓట్లు, 50వ డివిజన్‌లో నరేందర్‌కు 5 ఓట్లు, 34వ డివిజన్‌లో సబేరా బేగంకు, 33వ డివిజన్‌లో జహీరా బేగంకు 4 చొప్పున, నజియా సుల్తానాకు 3 ఓట్లు పడ్డాయి.

● 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి లావణ్యకు 17 ఓట్లు, 9వ డివిజన్‌లో ఒల్లెపు సుజాతకు 8 ఓట్లు, 5వ డివిజన్‌లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి మేత్రి రాజశేఖర్‌కు 7 ఓట్లు నమోదయ్యాయి.

● భీమ్‌గల్‌ మున్సిపాలిటీలో ఒకటో వార్డులో బీఎస్పీ అభ్యర్థి అరుణ్‌కుమార్‌కు 3 ఓట్లు, 6వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి మాధవికి 7 ఓట్లు, అదేడివిజన్‌లో బీఎస్పీ అభ్యర్థి సావిత్రికి 6 ఓట్లు వచ్చాయి.

● ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డులో ఇండిపెండెంట్‌ అభ్యర్థి నర్సయ్యకు 8 ఓట్లు, 7వ వార్డులో ఇండిపెండెంట్‌ అభ్యర్థి శ్రీకాంత్‌కు 2 ఓ ట్లు, 8వ వార్డులో ఇండిపెండెంట్‌ మానసకు ఆరు, 31 వార్డులో స్వతంత్ర అభ్యర్థి సుమన్‌కు 3 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement