నిజామాబాద్
న్యూస్‌రీల్
16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
● ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ,
మున్సిపల్ కమిషనర్
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని కౌన్సిల్ హాల్‌లో ఈనెల 16న ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జర గ నుంది. ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను శని వారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ ఏర్పాట్లను పరిశీలించి బందోబస్తుపై చర్చించారు. కార్పొరేటర్లతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులను మాత్రమేలో నికి అనుమతించనున్నట్లు తెలిసింది. మొదట కా ర్పొరేటర్ల ప్రమాణస్వీకారం, ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. 60 మంది కా ర్పొరేటర్లతోపాటు ఎంపీ, ఎమ్మెల్సీ, అర్బన్, రూర ల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ఎక్స్‌అఫీ షియో ఓట్లు కలిగి ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌ను సభ్యులు చేతులెత్తి ఎన్నుకుంటారు. ఎన్నికకు సంబంధించి ఇదివరకే కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకు అధికారులు సమాచారమిచ్చారు.
నిజామాబాద్


