ఇందూర్‌ మేయర్‌ ఎవరో? | - | Sakshi
Sakshi News home page

ఇందూర్‌ మేయర్‌ ఎవరో?

Feb 15 2026 6:48 AM | Updated on Feb 15 2026 6:48 AM

ఇందూర్‌ మేయర్‌ ఎవరో?

ఇందూర్‌ మేయర్‌ ఎవరో?

హంగ్‌ నేపథ్యంలో ఉత్కంఠ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఇందూరు నగరపా లక సంస్థ (కార్పొరేషన్‌) మేయర్‌ ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ సీట్లు రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. దీంతో ఇందూ రు నగరంలో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ బీజేపీకి అవకాశాలు లేకపోవడంతో ఎంఐఎంతో కలిసి మే యర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేసుకుంటోంది. మేయర్‌ అభ్యర్థిగా ఉన్న కాటిపల్లి శమంత 19వ డివిజన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీలోనే మరికొందరు మేయర్‌ స్థానానికి పోటీపడుతున్నారు. 21వ డివిజన్‌ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్‌ నుంచి గెలిచిన కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్‌ నుంచి గెలిచిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్‌ నుంచి గెలిచిన దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్‌ నుంచి గెలిచిన కేతావత్‌ సురేఖలు మే యర్‌ రేసులో ఉన్నారు. మొత్తం ఐదురుగురు మహిళలు పోటీలో ఉండగా నలుగురు బీసీలు, ఒకరు ఎస్టీ ఉన్నారు. వీ రు కాంగ్రెస్‌ పార్టీ పెద్దల టచ్‌లోకి వెళ్లి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదుగురిలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో ఉత్కంఠగా మారింది. దీంతో ఇందూరు నగరపాలకలో రాజకీ యం రసకందాయంలో పడింది. 60 డివి జన్లు ఉండగా.. బీజేపీకి 28, కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14, బీఆర్‌ఎస్‌కు ఒక సీటు వ చ్చింది. ఇక్కడ గతసారి మాదిరిగానే హంగ్‌ ఏర్పడింది. ఎంఐఎం మద్దతుతో మేయర్‌ చేజిక్కుంచుకునేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్‌ ఎస్‌ నుంచి గెలిచిన విజయలక్ష్మిని కాంగ్రెస్‌ పార్టీ తన క్యాంపునకు తరలించింది. ఈ కార్పొరేషన్‌లో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఎక్స్‌ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నా రు. దీంతో బీజేపీకి మూడు, కాంగ్రెస్‌కు రెండు ఓట్లు పెరిగినట్‌లైంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్‌–ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. కాగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైతం కాంగ్రెస్‌ ఆధీనంలోనే ఉండడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటు కలిపితే కాంగ్రెస్‌ వద్ద 34 ఓట్లు ఉన్నట్లే. ఇక బీజేపీకి ఎక్స్‌ అఫీషియోతో 31 ఓట్లు అవుతాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థి కాటిపల్లి శమంత ఓటమి నేపథ్యంలో పీఠం కోసం పలువురు పలువురు పోటీ పడుతున్నారు. మేయర్‌ ఆశిస్తున్నవారు ఆ పదవి దక్కదనుకుంటే ఏమైనా తేడా చేస్తారా అనే ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మేయర్‌ కాంగ్రెస్‌ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి మేయర్‌ ఖాయమైతే సహకరించిన ఎంఐఎం పార్టీకి గెలిచిన అభ్యర్థుల్లో ఒకరికి డిప్యూటీ మేయర్‌ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కేతావత్‌

సురేఖ

పంచరెడ్డి లలిత

బొంబోతుల పూజిత

కూరగాయల ఉమారాణి

దుమాల అరుంధతి

బోధన్‌టౌన్‌: ఎన్నికల ఫలితాల అనంతరం బోధన్‌ మున్సిపల్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. మొత్తం 38 వార్డులకు గాను కాంగ్రెస్‌ 17, బీఆర్‌ఎస్‌ 5, ఎంఐఎం 12, బీజేపీ 3 సీట్లు సాధించగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఏ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించలేదు. 17 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. స్వతంత్ర కౌన్సిలర్‌తోపాటు బీఆర్‌ఎస్‌కు చెందిన మరో కౌన్సిలర్‌ను సైతం కాంగ్రెస్‌ నాయకులు క్యాంప్‌నకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ లెక్కన కాంగ్రెస్‌ బలం 19కి చేరగా, ఎక్స్‌ అఫీషియో ఓటుతో చైర్మన్‌ పదవిని కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది.

బోధన్‌లో రసవత్తరం

కాంగ్రెస్‌, ఎంఐఎం కలిసి

కౌన్సిల్‌ ఏర్పాటు

కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి

ఓటమితో పెరిగిన పోటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement