బ్యాక్ వాటర్‌లో బ్రాహ్మిణి బాతులు
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌కు వలస పక్షుల రాక మొదలైంది. ఈ ఏడాది కొత్తగా బ్రాహ్మిణి బాతులు (రడ్డీ షెల్డక్స్) వలస వచ్చాయి. ఇవి సాధారణంగా భారత ఉప ఖండం అలాగే మధ్య ఆసియా, ఆగ్నేయ ఐరోపాలో శీతాకాల విడిది చేస్తాయి. చిత్తడి నేలలు, నదులు, జలాశయాలు వాటి సంతానోత్పత్తికి అనుకూలం. నారింజ, గోధుమ రంగుల్లో ఆకర్షనీయంగా కనిపించే ఈ బాతులు ఇప్పుడు డొంకేశ్వర్ మండలంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో కనువిందు చేస్తున్నాయి. – డొంకేశ్వర్(ఆర్మూర్)


