ఒకరు కాకపోతే మరొకరు..
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో దంపతులు రాణిస్తున్నారు. రిజర్వేషన్ ఆధారంగా భార్య, లేకపోతే భర్త కౌన్సిల్‌లో అడుగుపెడుతున్నారు. ఎవరికి అవకాశమొచ్చినా.. ప్రజా సమస్యలపై అవగాహన, పరిష్కారం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మన్ననలు పొందుతున్నారు. మేకల విజయ మల్లేశ్ యాదవ్ దంపతులు తాజాగా 23వ డివిజన్ నుంచి నాలుగోసారి విజయం సాధించారు. అలాగే తాజాగా 20వ డివిజన్ నుంచి న్యాలం సునీత రాజు (నర్సయ్య) హ్యాట్రిక్‌గా గెలుపొందారు. ప్రత్యర్థి ఎవరైనా విజయం సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న దంపతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
వాజ్‌పేయి, అద్వానీ స్ఫూర్తితో..
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ స్ఫూర్తితో మేకల మల్లేశ్ యాదవ్ 1990లో బీజేపీలో చేరారు. అయోధ్య రామమందిర రథయాత్రలో పాల్గొని బీజేపీ భావజాలాన్ని నరనరాన నింపుకొన్నారు. నాటి నుంచి నేటి వరకూ బీజేపీలోనే కొనసాగుతూ.. ఆ పార్టీ బీ ఫామ్‌తోనే ఎన్నికల్లో పో టీ చేస్తూ విజయం సాధిస్తున్నారు. ఇప్పటివరకు ఐ దుసార్లు పోటీ చేయగా, నాలుగు సార్లు మల్లేశ్‌యాదవ్ దంపతులు విజయం సాధించారు. అందులో మేకల విజయ మూడు సార్లు, మల్లేశ్‌యాదవ్ ఒక సారి గెలుపొందారు. 2000–05, 2005–10 వరకు మేకల విజయ, 2020–25లో మల్లేశ్‌యాదవ్ కార్పొరేటర్‌గా ఉన్నారు. తాజా ఎన్నికల్లో మళ్లీ మేకల విజయ మల్లేశ్ యాదవ్ విజయం సాధించి నాలుగోసారి కౌన్సిల్‌లో అడుగుపెట్టారు. 2022 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు మల్లేశ్‌యాదవ్ బీఆర్‌ఎస్‌లో కొనసాగారు. నిత్యం ప్రజల తో ఉంటూ వారికి కావాల్సిన వసతులు కల్పిస్తూనే, సమ స్యల పరిష్కారంలో ముందుండటం వల్లే ఓటర్లు ఆదరిస్తున్నా రని మేకల విజయ మల్లేశ్ యాదవ్ పేర్కొంటున్నారు.
కౌన్సిల్‌లోకి అడుగుపెడుతున్న
దంపతులు
రిజర్వేషన్ ఆధారంగా భర్త లేదా
భార్య కార్పొరేటర్లుగా..
మేకల విజయ మల్లేశ్ యాదవ్
నాలుగోసారి విజయం
మూడోసారి న్యాలం సునీత రాజు


