పకడ్బందీగా బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా బందోబస్తు

Feb 13 2026 5:23 AM | Updated on Feb 13 2026 5:23 AM

పకడ్బ

పకడ్బందీగా బందోబస్తు

పకడ్బందీగా బందోబస్తు భారీ చోరీ ఆలయాల అభివృద్ధికి చేయూతనందించాలి

నిజామాబాద్‌ అర్బన్‌: పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించనున్న కౌంటింగ్‌కు పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని అదనపు డీసీపీ బస్వారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాత్రి పాలిటెక్నిక్‌ కళాశాలలో సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, ఇతర సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోలీసు జాగిలాలతో కౌంటింగ్‌ కేంద్రం పరిసరాలను తనిఖీలు చేశారు. ఎంట్రీ పాసులు ఉన్న కౌంటింగ్‌ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది తమ వాహనాలను పాలిటెక్నిక్‌ కళాశాలలో పార్కింగ్‌ చేయాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు సీఎస్‌ఐ గ్రౌండ్‌లో పార్కింగ్‌ చేయాలని తెలిపారు.

బృందావన్‌ కాలనీలో

16 తులాల బంగారం అపహరణ

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు సమీపంలో ఉన్న బృందావన్‌ కాలనీలో గురువారం భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీలేఖ తన ఇంటికి తాళం వేసి బుధవారం రాత్రి దేవునిపల్లిలోని తన తల్లిగారింటికి వెళ్లారు. ఉదయాన్నే వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, సీసీఎస్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంట్లో దాచి ఉంచిన 16 తులాల బంగారం, 5 తులాల వెండి, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.

భిక్కనూరు: దేవాలయాల అభివృద్ధికి ప్రజలందరూ చేయూతనందించాలని సిద్ధరామేశ్వరాలయం మహంత్‌ సదాశివ మహంత్‌ అన్నారు. గురువారం తిప్పాపూర్‌ సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న కాకిగండి శివాలయంలో ఆయన మాట్లాడారు. శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిప్పాపూర్‌ సర్పంచ్‌ కుంట లింగారెడ్డి, ఆలయం అభివృద్ధి కమిటీ ప్రతినిదులు తెలిపారు. సైంటిస్టు ఆకిటి రాజిరెడ్డి.. ఆలయంలో టైల్స్‌ వేసేందుకు రూ.43 వేలు విరాళంగా అందజేశాడన్నారు.

నరకప్రాయంగా ప్రయాణం

నిజామాబాద్‌ రూరల్‌: మాధవనగర్‌ వద్ద ఆర్వోబీ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ఇరువైపుల రోడ్లు దెబ్బ తింటున్నాయి. కంకరతేలిన రోడ్డు ఉండడంతో పాటు దుమ్ము అధికంగా వస్తోంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ ప్రాంతంలో వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అధికారులు స్పందించి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

పకడ్బందీగా బందోబస్తు 1
1/2

పకడ్బందీగా బందోబస్తు

పకడ్బందీగా బందోబస్తు 2
2/2

పకడ్బందీగా బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement