రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలి
ఖలీల్‌వాడి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి కొఠారి కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా 30శాతం నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడలోని ఎస్‌ఎఫ్‌ఐ కా ర్యాలయంలో జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో స్కాలర్‌షిప్, ఫీ జు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు లు కట్టాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారని, దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. బడ్జెట్‌లో యూనివర్సిటీల అభివృద్ధికి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్లో గురుకులాలకు, అద్దె భవనాలలో నివసిస్తున్న హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని. సొంత భవనాలను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దీపిక, విఘ్నేష్, నగర అధ్యక్షులు ఆజాద్, నాయకులు రాజు, రమేశ్, శ్రీ చరణ్, గణేశ్, అభి నాయకులు పాల్గొన్నారు.


