సంక్షేమం, అభివృద్ధికి ఆదరణ | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం, అభివృద్ధికి ఆదరణ

Feb 18 2026 6:53 AM | Updated on Feb 18 2026 6:53 AM

సంక్షేమం, అభివృద్ధికి ఆదరణ

సంక్షేమం, అభివృద్ధికి ఆదరణ

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ర్పాటయ్యాక రెండేళ్లకాలంలో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికీ చేరాయి. అభివృద్ధి విషయంలోనూ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ, దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్‌ జిల్లాలో మత రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. జి ల్లాకు ఇప్పటికే వ్యవసాయ కళాశాల, తెలంగా ణ వర్సిటీకి ఇంజినీరింగ్‌ కళాశాల, రూ.600 కో ట్లతో జిల్లాలో మూడు చోట్ల యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ను మా ప్రభుత్వం మంజూరు చేసింది. భవిష్యత్తులో నగరం చుట్టూ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేస్తాం. పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం జిల్లాకు ఏమీ చేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే జిల్లాకు మెడికల్‌ కాలేజ్‌, తెలంగాణ వర్సిటీ, 16 చోట్ల ఎత్తిపోతల పథకాలు, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్ర భుత్వం వచ్చాకే జిల్లాకు అన్ని రకాల అభివృద్ధి ప్రాజెక్టులు మంజూరు అవుతున్నాయి. దీంతో ప్రజలు మరింతగా మద్దతు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తాం.

మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పీసీసీ చీఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement