క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Feb 20 2026 6:31 AM | Updated on Feb 20 2026 6:31 AM

క్రైం

క్రైం కార్నర్‌

ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య అదనపుకట్నం వేధింపులకు వివాహిత.. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జరిమానా

అదృశ్యమైన మహిళ మృతి

ఇందల్వాయి: మండల కేంద్రంలో అదృశ్యమైన ఓ వివాహిత చెరువులోపడి మృతి చెందినట్లు ఎస్సై సందీప్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయికి చెందిన బాలమణి(43) అలియాస్‌ జమున అనే మహిళ మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం గ్రామంలోని పెద్ద చెరువులో బాలమణి మృతదేహం బయటకు తేలడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి భర్త నడిపి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ధర్పల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట రాజన్న(42) ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశానికి వెళ్లి రెండేళ్ల క్రితం తిరిగి ఇంటికి వచ్చాడు. బుధవారం ఇంటి నుంచి వెళ్లిన రాజన్న తిరిగి రాలేదు. గురువారం ఉదయం చుట్టుపక్కల వెతకగా, వ్యవసాయ పొలం పక్కన ఉన్న చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

బోధన్‌: అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్త, అత్త మామల వేధింపులు తాళ లేక ఓ వివాహిత ఆత్మహ త్య చేసుకున్న ఘటన గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎడపల్లి ఎస్సై ము త్యాల రమ తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన పల్లపు సావిత్రి కుమార్తె శైలజకు ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన వీర్ల సతీశ్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో శైలజ కుటుంబీకులు శక్తి మేరకు కట్నకానుకలు ఇచ్చారు. భర్త సతీశ్‌, అత్తమామల వెంకటేశ్‌, శంకరమ్మ అదనపు కట్నం కోసం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. భర్త సతీశ్‌ దుబాయి వెళ్లేందుకు అదనంగా రూ. లక్ష తీసుకురావాలంటు భార్య వేధించేవాడు. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్మూర్‌టౌన్‌: డ్రంకెన్‌ డ్రెవ్‌ తనిఖీల్లో పట్టుబడ్డ ఇద్దరికి జరిమానా, మరొకరికి జైలు శిక్షణను ఆర్మూర్‌ మెజిస్ట్రేట్‌ విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. ఆర్మూర్‌ పీఎస్‌ పరిధిలో గురువారం నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడ్డ ముగ్గురిని పోలీసులు కోర్టు లో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన జడ్జి ము గ్గురిలో ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమా నా, మరొకరికి మూడు రోజులపాటు జైలు శిక్ష ను విధించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు.

క్రైం కార్నర్‌1
1/1

క్రైం కార్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement