జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా

Feb 18 2026 7:25 AM | Updated on Feb 18 2026 7:25 AM

జేఈఈ

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా

ఖలీల్‌వాడి : జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో పలు కళాశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. నగరంలోని బన్సల్‌ కాలేజీకి చెందిన దోడా రవితేజ(96.66), బీ నరసింహ(91.66), ఎన్‌ సంజీవ దత్తా(90.48), పీ త్రిషాల(89.21), పీ హాసిని(88.25), బీ దినేశ్‌కుమార్‌(87.40), ఏ వినాయక్‌(85.15) పర్సంటైల్‌ స్కోరుతో నిలిచినట్లు కళాశాల ఇన్‌చార్జి లక్ష్మణ్‌ మంగళవారం తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కాలేజీ యాజమాన్య సభ్యులు సన్మానించారు.

నారాయణ జూనియర్‌ కళాశాల విద్యార్థులు

ఖలీల్‌వాడి: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో నగరంలోని నారాయణ జూనియర్‌ కాలేజ్‌ విద్యార్థి ఇంజినీరింగ్‌ విభాగంలో సత్తా చాటినట్లు ప్రిన్సిపాల్‌ ఏజీఎం కుంట లక్ష్మారెడ్డి తెలిపారు. కాలేజీకి చెందిన పల్లెర్ల విరాజ్‌(99.73) పర్సంటైల్‌ స్కోరుతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. అలాగే ఎం విష్ణు ప్రసాద్‌(97.53), డీజే ప్రతీక్‌(96.72), బోగా శ్రీచరణ్‌ ఆదిత్య(96.71), బింగి వరుణ్‌(96.26), యెనుగుల శ్రీరామ్‌(95.64), ఎల్లా సాత్విక్‌(95.06), కే వెంకట అనీష్‌(94.23), ట్యాంక్‌ సిద్ధి(94.1), బీ ఓం సాయి మహంత(91.63), కే సాయి శ్రీఖర్‌(87.21), ఆర్‌ రాంచరణ్‌(85.94), కదం హాసిని(84.68), వంగ హర్షవర్ధన్‌(84.36), కొండపాక మోక్షద(83.98), దేశ్‌ముఖ్‌ అథర్వ్‌(82.65), బానోత్‌ క్రాంతికుమార్‌(82.16) పర్సంటైల్‌ స్కోరు సాధించారు. 22 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జీఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ రవిగౌడ్‌, కోర్‌ డీన్‌ వీరాంజనేయ ప్రసాద్‌, కళాశాల ఏవో మేధరి శేఖర్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

నగరంలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 2023–24లో పదోతరగతి ఐపీఎల్‌ బ్యాచ్‌కి చెందిన చక్రాల శ్రీకర్‌(99.80), నల్లపు తనీశ్‌(99.75), బాగ్గాలి వర్షిత్‌(99.41), జిష్ణు(99.11), కొండా మనిమంతన్‌(99.07), యజ్ఞకత్‌ గౌడ్‌(98.83) పర్సంటైల్‌ స్కోరు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం మహిపాల్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ స్వప్న, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రదీప్‌ గౌడ్‌, ఐపీఎల్‌ ఇన్‌చార్జి శివకుమార్‌, డీన్‌ ఈశ్వర్‌ విద్యార్థులను అభినందించారు.

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా1
1/4

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా2
2/4

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా3
3/4

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా4
4/4

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement