నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌గా ఎన్నికై న కూరగాయల ఉమారాణి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు హాజరుకావాలని ఆయన కోరారు.
వర్ని(మోస్రా): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని గోవూరు గ్రామంలో రూ. 50 లక్షలతో నిర్మాణం చేపట్టిన జనరల్ ఫంక్షన్ హాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కత్తి రవి, ఏఎంసీ చైర్మన్ సురేశ్ బాబా, వైస్ చైర్మన్ లక్ష్మణ్, తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీవో సాయికుమార్, విండో మాజీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, వీడీసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, నాయకులు రామ్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, అబ్బయ్య పాల్గొన్నారు.
వర్ని: ప్రతి ఒక్కరూ దైవచింతనతో పాటు భక్తి భావనతో మెలగాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండలంలోని తగిలేపల్లి గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మించిన ఆశ్రమ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆశీర్వాదాన్ని ఎమ్మెల్యే తీసుకున్నారు.
నేడు ఇంటర్ సీఎస్,
డీవోల సమావేశం
ఖలీల్‌వాడి : జిల్లా కేంద్రంలోని ఖిల్లా బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల సమావేశం శుక్రవారం నిర్వహించనున్నట్లు డీఐఈవో రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, సీఎస్, డీవోలు సమయానికి హాజరుకావాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల కస్టోడియన్‌లు సైతం సమావేశంలో పాల్గొనాలని పేర్కొన్నారు.
నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్
నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్


