నాడు రమేష్‌కు కరాటే గురువు
● నేడు రమేష్ సతీమణి ఉమారాణికి మేయర్ పదవి
● ఇదీ శిష్యుడి కుటుంబానికి
మహేశ్‌గౌడ్ ఇచ్చిన విలువ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శిష్యుడి కుటుంబం నిరుపేదదైనప్పటికీ అనుబంధాన్ని మాత్రం మరింత బలోపేతం చేశారు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్. తన శిష్యుడు కరాటే రమేష్ సతీమణి కూరగాయల ఉమారాణిని నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. నగరానికి చెందిన రమేష్ (కరాటే రమేష్) 40 ఏళ్ల క్రితం మహేశ్‌గౌడ్ వద్దకు వచ్చాడు. కరాటేలో శిక్షకుడిగా ఉన్న మహేశ్‌గౌడ్ రమేష్‌ను కరాటేలో నిష్ణాతుడిని చేశారు. నాటి నుంచి నేటివరకు వాళ్ల గురుశిష్య బంధం మరింత బలపడుతూ వచ్చింది. కరాటే ద్వారా వచ్చిన శిష్యరికాన్ని రమేష్ రాజకీయంలోనూ కొనసాగించారు. రమేష్ పేద కుటుంబానికి చెందిన వ్య క్తి అయినప్పటికీ మహేశ్‌గౌడ్ మంచి విలువ ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో రమేష్ సతీమణి ఉమారాణిని కార్పొరేటర్‌గా నిలబెట్టి గెలిపించారు. ఇంతటితో ఆగకుండా ఉమారాణిని ఏకంగా మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. తనకు విధేయుడిగా ఉన్న రమేష్ కుటుంబం విషయంలో మహేశ్‌గౌడ్ చూపిన అభిమానాన్ని వెలకట్టలేమని వారిగురించి తెలిసినవారు చెబుతున్నారు. ఇప్పటికీ టైలరింగ్ పనిచేస్తున్న ఉమారాణిని మేయర్‌గా ప్రతిపాదించిన నేపథ్యంలో మహేశ్‌గౌడ్‌పై అనేక ఒత్తిళ్లు వచ్చాయి. ఇతరులు భారీగా డబ్బులు ఆఫర్ చేసినప్పటికీ వాటిని తిరస్కరించారు. శిష్యుడి భార్య ఉమారాణికే పట్టం కట్టారు. ఇదిలా ఉండగా తన సొంత నియోజకవర్గంలోని భీమ్‌గల్ మున్సిపాలిటీ గెలుపు కోసం సైతం మహేశ్‌గౌడ్ రాజకీయ చాణక్యం ప్రదర్శించారు.


