మున్సిపాలిటీలను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం

Feb 17 2026 8:49 AM | Updated on Feb 17 2026 8:49 AM

మున్సిపాలిటీలను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం

మున్సిపాలిటీలను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చి దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త మ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ప్రభు త్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన అ భివృద్ధి, సంక్షేమ పథకాల అమలు దేశంలోని ఏ రా ష్ట్రంలో జరగలేదని, ఇది తన 40 ఏళ్ల రాజకీయ అ నుభవంతో చెబుతున్నానని అన్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లో పూడిక తీసి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లోనూ ప్రజ లు కాంగ్రెస్‌ వైపే ఉన్నారన్నారు. మంచిప్ప 21, 22 ప్యాకేజీలకు నిధులు కేటాయించి పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. నాయకుడు నరేందర్‌రెడ్డికి సరైన గుర్తింపు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి..

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలు అభివృద్ధిని ఆదరించారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లు తగ్గ డం సాధారణమేనని, కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీ అని అన్నారు.

అర్వింద్‌.. ఫెయిల్యూర్‌ ఎంపీ

ఎంపీ అర్వింద్‌ ధర్మపురి ఫెయిల్యూర్‌ ఎంపీ అని, ఏడేళ్లలో ఏం చేశారో చెప్పడం లేదని, భవిష్యత్‌లో ఏం చేస్తారో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి విమర్శించారు. ఇప్పటికై నా మతం, దేవుడి పేర్లతో ఓట్లు అడగడం మానుకోవాలని హితవుపలికారు.

అనంతరం మేయర్‌గా ఎన్నికై న కూరగాయల ఉమారాణిరమేశ్‌తోపాటు కాంగ్రెస్‌ కార్పొరేటర్లను సన్మానించారు. కాంగ్రెస్‌ భవన్‌ ఎదుట నాయకు లు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు చేశా రు. డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మ న్లు తాహెర్‌, మానాల మోహన్‌రెడ్డి, వ్యవసాయ క మిషన్‌ సభ్యు డు గడుగు గంగాధర్‌, నుడా చైర్మన్‌ కేశ వేణు, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, నరేందర్‌రెడ్డి, వైశాక్షి సంతోష్‌, జావిద్‌ అక్రమ్‌, ఖుద్దూస్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామీణులతోపాటు

పట్టణవాసులూ కాంగ్రెస్‌ వైపే..

పార్లమెంట్‌ పరిధిలో క్లీన్‌స్విప్‌

చేయడం సంతోషం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement