ఆ పార్టీలన్నీ ఒక్కటేనని గతంలో చెప్పా
సుభాష్‌నగర్: బీజేపీని ఓడించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని, ఆ పార్టీలన్నీ ఒక్కటేనన గతంలోనే తాను చెప్పానని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. మేయర్ ఎన్నిక అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు 34 ఓట్లు, బీజేపీకి 31 ఓట్లు వచ్చాయని, 3 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మేయర్, ఎంఐఎం డిప్యూ టీ మేయర్ పదవిని గెల్చుకున్నాయన్నారు. బీజేపీని ఓడించేంఉదకు అనైతిక పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. బీజేపీ ఓటమిలో కాంగ్రెస్ రంగు పూసుకుని తిరిగే పోలీసుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. నైతిక విజయం తమదేనని, ఈ టర్మ్ అయ్యేలోపు కార్పొరేషన్‌ను బీజేపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. కాళేశ్వరం, ఈ కార్ రేసింగ్ తదితర కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు కాపాడుతున్నారో ఈ రోజుతో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.
బీజేపీని ఓడించేందుకు అనైతిక పొత్తు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం
ఒక్కటయ్యాయి
టర్మ్ అయ్యేలోగా కార్పొరేషన్‌ను
కై వసం చేసుకుంటాం
మీడియాతో ఎంపీ అర్వింద్ ధర్మపురి


