నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Feb 17 2026 8:49 AM | Updated on Feb 17 2026 8:49 AM

నిజామ

నిజామాబాద్‌

న్యూస్‌రీల్‌

వాతావరణం

ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. పగలు ఎండ తీవ్రత పెరుగుతుంది. రాత్రి చలి తీవ్రత తగ్గుతుంది.

ఫిర్యాదులను త్వరితగతిన..

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపా ఠి అధికారులను ఆదేశించారు.

మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థికి అనుకూలంగా చేతులెత్తిన పీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌గౌడ్‌, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కార్పొరేటర్లు

బీజేపీ మేయర్‌ అభ్యర్థి స్రవంతిరెడ్డికి అనుకూలంగా చేతులెత్తిన ఎంపీ అర్వింద్‌,

ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ

కామారెడ్డి చైర్‌పర్సన్‌గా ఇప్ప ఉమారాణి

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 38వ వార్డు కౌన్సిలర్‌ ఇప్ప ఉమారాణి కామారెడ్డి ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అలా గే బిచ్కుంద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా సీమా షెట్కార్‌, బాన్సువాడ బల్దియా చైర్‌పర్సన్‌గా కాసుల విజయ, ఎల్లారెడ్డి మున్సిపాలి టీ చైర్‌పర్సన్‌గా పద్మ శ్రీకాంత్‌ ఎన్నిక య్యారు. జిల్లాలో నాలుగు బల్దియాలు ఉండగా.. రెండు చైర్‌పర్సన్‌ స్థానాలను మహిళలకు రిజర్వ్‌ చేశారు. అయితే మూడింటిలో మహిళలకు అవకాశం దక్కడం గమనార్హం. కామారెడ్డి, బాన్సువాడలను మహిళలకు కే టాయించగా.. అదనంగా జనరల్‌ స్థానమైన బిచ్కుంద సైతం వారి ఖాతాలోనే చేరింది. మరోవైపు నాలుగుచోట్లా వైస్‌ చైర్‌పర్సన్‌లుగా మహిళలే ఎన్నికవడం గమనార్హం.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలి

నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన బా లబాలికలు తమ ప్రతిభను చాటాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు పాఠశాల వి ద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని దోమలగూడలో మంగళవారం నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా, జిల్లా నుండి 35 మంది బాలబాలికలతో కూడిన బృందం పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయ ల్దేరి వెళ్లింది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణ నుంచి బస్సు బయల్దేరగా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. చిన్నారులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. డీఈవో అశోక్‌, భవిత కేంద్రాల కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌రావు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, రిసోర్స్‌ పర్సన్లు పాల్గొన్నారు.

పీజీ పరీక్షలు

26కు వాయిదా

తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ మొదటి సెమిస్టర్‌, ఇంటిగ్రేటెడ్‌ పీజీ (ఐఎంబీఏ) 7వ సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 26 కు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల వినతి మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

పసుపు పరిశోధన కేంద్రంలో అమెరికా ప్రొఫెసర్లు

కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని అమెరికాలోని అలబామా ఉద్యాన యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ల బృందం సోమవారం సందర్శించింది. పసుపుపై కొనసాగుతున్న పరిశోధన ల గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మహేందర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. పసుపు రకాలు, కుర్కుమిన్‌ శాతం, దిగుబడి, పంట కాల పరిమితి, వివి ధ రకాల సాగు ప్రయోజనాలు, యాజమా న్య పద్ధతుల గురించి అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పనిముట్లు పసుపు శుద్ధి పాలిషింగ్‌, నిల్వ చేసే పద్ధతులను తెలుసుకున్నారు. అమెరికాలో పసుపు సాగుపై అక్కడి రైతులు ఆసక్తి చూపుతున్నారని ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

మహిళలే.. పురపాలికలు

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగర పాలక సంస్థ మేయర్‌ పదవి కోసం కాంగ్రెస్‌ అభ్యర్థిగా 49వ డివిజన్‌ నుంచి ఎన్నికై న కూరగాయల ఉమారాణి పేరు ను ఆ పార్టీకి చెందిన సభ్యుడు అగ్గు భోజన్న ప్రతిపాదించగా, అబుద్‌ బిన్‌ అథర్‌ బలపర్చా రు. బీజేపీ మేయర్‌ అ భ్యర్థిగా జి స్రవంతి రెడ్డి పేరును వీరమాచినేని ప్రమోద్‌కుమా ర్‌ ప్రతిపాదించగా, ఎర్రం సుధీర్‌ బలపర్చారు. డిప్యూటీ మే యర్‌ పదవి కోసం ఏఐఎంఐఎం తరఫు న సల్మా తహసీన్‌ (54వ డివిజన్‌), బీజేపీ అభ్యర్థిగా బంటు రాము పోటీపడ్డారు. అధికారులు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక జరిపించారు. నగర పాలక సంస్థలో మొత్తం 60 కార్పొరేటర్లతోపాటు ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు డాక్టర్‌ భూపతిరెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పి రాకేశ్‌రెడ్డి ఎక్స్‌ అఫీషియో హోదాలో ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. మొత్తం 65 మంది సభ్యులకుగాను 34 మంది సభ్యులు కాంగ్రెస్‌ అభ్యర్థిని కూరగాయల ఉమారాణిని మేయర్‌గా, ఏఐఎంఐఎం అభ్యర్థిని సల్మా తహసీన్‌కు డిప్యూటీ మేయర్‌గా మద్దతు తెలిపారు. బీజేపీ అభ్యర్థులుగా పోటీ పడిన గోపిడి స్రవంతిరెడ్డి, బంటు రాములకు 31 మంది మద్దతు లభించింది. దీంతో నిజామాబా ద్‌ నగర మేయర్‌గా ఉమారాణి, డిప్యూటీ మేయ ర్‌గా సల్మా తహసీన్‌ ఎన్నికై నట్లు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే నగర తొలి మహిళా డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్‌ ఎన్నికయ్యారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌ ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ, వీడియో చిత్రీకరణ నడుమ పూర్తి పారదర్శకంగా ఈ ఎన్నికల ప్రక్రియను జరిపించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సరిపడా కోరం ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలోని నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీవారే పాలనా పీఠాలు ఎక్కారు. నిజామాబాద్‌, బోధన్‌లలో హంగ్‌ నెలకొన్నప్పటికీ ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవులను చేజిక్కించుకుంది. ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో సంపూర్ణ ఆధిక్యంతో కాంగ్రెస్‌ పీఠాలను వశం చేసుకుంది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్‌ దక్కించుకుంది. మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన కూరగాయల ఉమా రాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా ఎంఐఎం పార్టీకి చెందిన సల్మా తహసీన్‌ను ఎన్నుకున్నారు. సోమవారం నిర్వహించిన ఓటింగ్‌లో వీరిద్దరికీ 34 మంది మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్‌, ఎంఐఎం కార్పొరేటర్లతోపాటు బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఒక కార్పొరేటర్‌, ఎక్స్‌అఫీషియో ఓటర్లు ఎమ్మెల్సీ బొ మ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఉమారాణి, సల్మా తహసీన్‌కు మద్దతుగా చేతులెత్తారు. దీంతో ఓట్ల సంఖ్య 34 అయింది. బీజేపీ నుంచి మేయర్‌ పదవికి గోపిడి స్రవంతిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేయగా ఆమెకు మద్దతుగా పార్టీకి చెందిన 28 మంది చేతులెత్తారు. అదేవిధంగా ఎక్స్‌ అఫీషియో సభ్యులైన ఎంపీ ధర్మపురి అర్వింద్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి స్రవంతికి మద్దతుగా చేతులెత్తారు. 34 ఓట్లు వచ్చిన కాంగ్రెస్‌కు చెందిన ఉమారాణి, ఎంఐఎంకు చెందిన సల్మా తహసీన్‌లు మేయర్‌, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం అభ్యర్థులు వేరువేరు బస్సుల్లో ఆయా క్యాంపుల నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి వచ్చారు.

సుభాష్‌నగర్‌: రాష్ట్రంలో 42శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వలేకపోయినా.. నిజామాబాద్‌ మేయర్‌ పదవిని బీసీలకు ఇచ్చి చిత్తశుద్ధిని చాటుకున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. మేయర్‌ ఎన్నిక అనంతరం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద, నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఉమారాణి ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ మద్దతుతో మేయర్‌గా ఎన్నికయ్యారని, ఆమె ఎన్నిక చరిత్రాత్మకమని అన్నారు. 16 ఏళ్ల తర్వాత మేయర్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ కై వసం చేస్తుందని, 17 సీట్లు గెలిపించిన పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధే తమ ఎజెండా అని, ఎంఐఎంతో పొత్తు లోపాయికారి పొత్తు కాదని స్పష్టంచేశారు. ఎంఐఎంతో ఎన్నికల్లో పోటీ పడ్డామని, ఎన్నికలయ్యాక పొత్తు అనివార్యమైందని అన్నారు. ఈ ఎన్నిక వరకు మాత్రమే పొత్తు పరిమితమని అన్నారు. బీజేపీ మతాన్ని రెచ్చగొట్టి పోటీ చేసిందని విమర్శించారు. నిజామాబాద్‌ నగరాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలనే తపనతోనే ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ సభ్యులు మద్దతు తెలిపారని స్పష్టంచేశారు.

ప్రశాంతంగా ప్రత్యేక సమావేశాలు

సుభాష్‌నగర్‌: జిల్లాలోని నగర పాలక సంస్థతోపాటు బోధన్‌, ఆర్మూర్‌, భీ మ్‌ గల్‌ మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రశాంతంగా ము గిశాయి. నూతనంగా ఎన్నికై న సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశాలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మార్గనిర్దేశంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్‌లో ఆర్డీవో రాజేంద్రకుమార్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించగా, బోధన్‌, ఆర్మూర్‌ల సబ్‌ కలెక్టర్లు వికాస్‌ మహతో, అభిగ్యాన్‌ మాల్వియ, భీమ్‌గల్‌లో జెడ్పీ సీఈవో సా యా గౌడ్‌ పీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీల వారీగా సభ్యులు సమావేశపు హాళ్లలోకి చేరుకో గా, ఎన్నికై న సభ్యులతో అధికారులు తెలుగులో ప్రమాణం చేయించారు. కా ర్పొరేషన్‌లో ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో పాల్గొన్నారు.

‘పురం’ హస్తగతం

నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌,

భీమ్‌గల్‌లలో రెండో టర్మ్‌..

బోధన్‌లో వరుసగా రెండోసారి

చైర్‌పర్సన్‌గా తూము పద్మ

నిజామాబాద్‌లో వరుసగా

మూడోసారి మహిళా మేయర్‌

నిజామాబాద్‌1
1/11

నిజామాబాద్‌

నిజామాబాద్‌2
2/11

నిజామాబాద్‌

నిజామాబాద్‌3
3/11

నిజామాబాద్‌

నిజామాబాద్‌4
4/11

నిజామాబాద్‌

నిజామాబాద్‌5
5/11

నిజామాబాద్‌

నిజామాబాద్‌6
6/11

నిజామాబాద్‌

నిజామాబాద్‌7
7/11

నిజామాబాద్‌

నిజామాబాద్‌8
8/11

నిజామాబాద్‌

నిజామాబాద్‌9
9/11

నిజామాబాద్‌

నిజామాబాద్‌10
10/11

నిజామాబాద్‌

నిజామాబాద్‌11
11/11

నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement