మూడు చోట్ల..
●బోధన్‌లో ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ చైర్‌పర్సన్ స్థానం దక్కించుకుంది. ఇది జనరల్ స్థానం అయినప్పటికీ మళ్లీ మహిళనే చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. తూము పద్మను చైర్‌పర్సన్ చేశారు. పద్మ గత టర్మ్‌లోనూ ఇదే పదవిని నిర్వహించారు. 38 వార్డులు ఉన్న బోధన్‌లో మ్యాజిక్ ఫిగర్ 20. కాంగ్రెస్ 17, ఎంఐఎం 12, బీఆర్‌ఎస్ 5, బీజేపీ 3 వార్డులు గెలవగా, స్వతంత్రులు ఒకరు గెలిచారు. కాంగ్రెస్, ఎంఐఎం, ఇండిపెండెంట్, ఎక్స్ అఫీషియో అయిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఓట్లు కలిపి 31 వచ్చాయి. పద్మ చైర్‌పర్సన్ కాగా, ఎంఐఎంకు చెందిన మీర్ ఇలియాస్ అలీ వైస్ చైర్మన్ అయ్యారు.
● ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్‌గా గోనె లహరి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా కాటిపల్లి వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. భీమ్‌గల్ చైర్‌పర్సన్‌గా బొదిరె నాగమణి, వైస్ చైర్ పర్సన్‌గా సంటి లత ఎన్నికయ్యారు. జిల్లాలో గత టర్మ్‌లోనూ నలుగురు పురపాలికలు మహిళలే కావడం విశేషం. నిజామాబాద్ నగరానికి వరుసగా ముగ్గురు మేయర్లు బీసీ మహిళలే కావడం విశేషం. తెలంగాణ వచ్చాక ఇప్పటివరకు ఇందూరు నగరానికి మహిళలే మేయర్లు అవుతూ వస్తున్నారు.
మూడు చోట్ల..
మూడు చోట్ల..


