రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ డేలో ప్రతిభ
నిజామాబాద్ అర్బన్/ ఆర్మూర్: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ డేలో నిజామాబాద్ జిల్లా చిన్నారులు ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చిన్నారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి హాజరైన దివ్యాంగ విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనగా జిల్లాకు చెందిన 35 మంది క్రీడాకారులు పలు విభాగాల్లో బహుమతులను కై వసం చేసుకున్నారు. స్పోర్ట్స్ డే మార్చ్ పాస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచి మొదటి బహుమతిని దక్కించుకున్నారు. అదేవిధంగా ఇండోర్, అథ్లెటిక్స్‌లో వివిధ వయసుల్లో నిర్వహించిన పోటీల్లో పలు బహుమతులను కై వసం చేసుకున్నారు. లాంగ్ జంప్‌లో పునీత్(నిజామాబాద్) ద్వితీయ బహుమతి, స్పీడ్ వాకింగ్‌లో గంగోత్రి(కమ్మర్‌పల్లి) ద్వితీయ బహుమతి, ఫ్రాగ్ జంపింగ్‌లో విన్యశ్రీ(కమ్మర్‌పల్లి), అల్లూరి, మహాలక్ష్మి(జక్రాన్‌పల్లి) ద్వితీయ బహుమతి, తనీష్(మోర్తాడ్) స్పీడ్ వాకింగ్, మనీష్, చార్వీ (మోర్తాడ్) ఫ్రాగ్ జంపింగ్‌లో ద్వితీయ బహుమతులు, చార్వి లెమన్ స్ఫూన్‌లో తృతీయ బహుమతి, రితిక(డిచ్‌పల్లి) ఫ్రాగ్ జంపింగ్‌లో తృతీయ బహుమతి, అబ్దుల్ రజాక్(నిజామాబాద్) రన్నింగ్‌లో తృతీయ బహుమతి, షేక్ రూమన్ (ఇందల్వాయి) మ్యూజికల్ చైర్‌లో ద్వితీయ బహుమతి సాధించారు. విజేతలకు రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా బహుమతి అందజేశారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో
సత్తా చాటిన జిల్లా దివ్యాంగ విద్యార్థులు
మార్చ్‌పాస్ట్‌లో రాష్ట్ర స్థాయిలో
మొదటి బహుమతి కై వసం
పలు క్రీడా పోటీల్లో బహుమతులు
రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ డేలో ప్రతిభ


