సీఎం కప్ బేస్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో మినీ స్టేడియం, జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల క్రీ డా మైదానంలో శనివారం సీఎం కప్ బేస్‌బాల్ జిల్లా మహిళ, పురుషుల జట్ల ను ఎంపిక చేసినట్లు జిల్లా క్రీడాధికారి పవన్ కుమార్ తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం జరగనున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో బేస్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, సంయుక్త కార్యదర్శులు సుజాత, చిప్ప నవీన్, వ్యాయామ ఉపాధ్యాయులు నాగభూషణం, రమేశ్, స్వప్న, క్రీడాకారులు పాల్గొన్నారు.
మూడు ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని లింబూర్ శివారులో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు మూడు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేశారు. అందులో ఉన్న ఆయిల్, కాపర్ వైర్ చోరీ అపహరణకు గురైనట్లు రైతులు పురుశోత్తం, గజానంద్, శంకర్ తెలిపారు. పోలీసులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ దుండగులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సీఎం కప్ బేస్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక


