వరుస విజయాలతో.. | - | Sakshi
Sakshi News home page

వరుస విజయాలతో..

Feb 16 2026 7:41 AM | Updated on Feb 16 2026 7:41 AM

వరుస విజయాలతో..

వరుస విజయాలతో..

వరుస విజయాలతో..

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో ఒక హయాంలో భార్య లేదా భర్త హ్యాట్రిక్‌గా కార్పొరేటర్లుగా అడుగుపెట్టడం న్యాలం సునీత రాజు(నర్సయ్య) దంపతులకే సాధ్యమైంది. 2014–19 వరకు న్యాలం సునీత(4వ డివిజన్‌), 2020–25 వరకు న్యాలం రాజు(20వ డివిజన్‌) కార్పొరేటర్లుగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో 20వ డివిజన్‌ నుంచే న్యాలం సునీత మరోసారి ఎన్నికయ్యా రు. డివిజన్‌లో మైనార్టీ ఓట్లు ఉన్నప్పటికీ.. కా ర్పొరేటర్‌గా కుల, మత బేధం లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్నారు. 2002 నుంచి బీజేపీలో కొనసాగుతున్న న్యాలం రాజు.. అంతకుముందు ఏబీవీపీలో కార్యకర్తగా ఉ న్నారు. ఆ తర్వాత బీజేవైఎం నగర, జి ల్లా అధ్యక్షుడిగా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని, ఆ తర్వాత ప్ర జా సేవకుడిగా ఉంటూ కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తుండడం వల్లే ఓటర్లు మూడోసారి తమను ఆదరించారని న్యాలం సునీత రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement