నితిన్ భాయ్ దేశాయ్‌కు నివాళులు
నిజామాబాద్ రూరల్ : తెలంగాణలోని లక్షల బీడీ కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపిన దేశాయ్ బ్రదర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ భాయ్ దేశాయ్ సంతాప సభను సంస్థ ఉద్యోగులు, టేకేదారులు జిల్లా కేంద్రంలోని గుజరాతి బీడీ వాలా ప్రగతి సమాజ్‌లో బుధవారం నిర్వహించారు. ఈనెల 8న అనారోగ్యంతో మృతి చెందిన నితిన్ భాయ్ దేశాయ్‌కి నివాళులు అర్పించారు. డీబీఎల్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఓ పక్క విస్తరిస్తూనే.. మరో పక్క నిరుపేదల ఆర్థిక ఎదుగుదలకు నితిన్ భాయ్ విశేషంగా కృషి చేశారని పలువురు ఉన్నత ఉద్యోగులు కొనియాడారు. కార్యక్రమంలో దేశాయి బ్రదర్స్ బీడీ కంపెనీ తెలంగాణ ప్రొడక్షన్ మేనేజర్ రష్మీకాంత్ భాయ్, నిజామాబాద్, కామారెడ్డి డివిజన్‌ల డీఎంలు విపుల్ భాయ్, ఉమేశ్ భాయ్, ఏడీఎంలు అనిల్ భాయ్, బ్రిజేష్ భాయ్, క్వాలిటీ ఇన్‌చార్జిలు గంగాధర్ భాయ్, చంద్రమౌళి భాయ్, ఉమ్మడి జిల్లాలలోని రేంజ్ మేనేజర్లు, బీడీ కార్మిక సంఘాల నాయకులు, టేకేదార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


