రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
పెర్కిట్: ఆర్మూర్ మండలం పిప్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం నవీన్ కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీల్లో పాఠశాలకు చెందిన ఏ వైష్ణవి, ఎన్ అస్మిత అద్భుత ప్రతిభతో రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు హెచ్‌ఎం పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని అన్నారు. విద్యార్థులను హెచ్‌ఎం నవీన్, పీఈటీ గంగారెడ్డి, సర్పంచ్ కిరణ్, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ అభినందించారు.


